కేరళ బ్రాండ్ అంబాసిడర్ గా స్టెఫీగ్రాఫ్ | Tennis legend Steffi Graf to promote Kerala's Ayurveda | Sakshi
Sakshi News home page

కేరళ బ్రాండ్ అంబాసిడర్ గా స్టెఫీగ్రాఫ్

Published Wed, Jun 24 2015 3:45 PM | Last Updated on Sun, Sep 3 2017 4:18 AM

కేరళ బ్రాండ్ అంబాసిడర్ గా స్టెఫీగ్రాఫ్

కేరళ బ్రాండ్ అంబాసిడర్ గా స్టెఫీగ్రాఫ్

తిరువనంతపురం: జర్మనీ టెన్నిస్ దిగ్గజం స్టెఫీగ్రాఫ్ కేరళ ఆయుర్వేద వైద్యం ప్రచారకర్తగా నియమితులయ్యారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు తన ఆటతో అభిమానుల అలరించిన 46 ఏళ్ల స్టెఫీగ్రాఫ్ ను కేరళ ప్రభుత్వం ఆయుర్వేద బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని  ముఖ్యమంత్రి ఒమెన్ చాందీ బుధవారం తెలిపారు. 'విజిట్స్ కేరళ స్కీమ్'లో భాగంగా స్టెఫీగ్రాఫ్ తో ఒప్పందం కుదుర్చుకునేందుకు కేరళ పర్యాటక సంస్థకు అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.

టూరిజం బోర్డు ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు సాగించి, ఒప్పందం కుదుర్చుకునేందుకు రంగం సిద్ధం చేసింది. కెరీర్ లో 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన ఈ మాజీ నంబర్ వన్ క్రీడాకారిణి 1999లో టెన్నిస్ కు గుడ్ బై చెప్పింది. మాజీ నంబర్ వన్ ఆటగాడు ఆండ్రీ ఆగసీని 2001, అక్టోబర్ లో ఆమె వివాహం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement