మెయిన్ ‘డ్రా’కు సాయిశరణ్, అశ్విన్ | The main draw to the saisharan , Ashwin | Sakshi
Sakshi News home page

మెయిన్ ‘డ్రా’కు సాయిశరణ్, అశ్విన్

Published Mon, Mar 10 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 AM

The main draw to the saisharan , Ashwin

ఐటీఎఫ్ టోర్నమెంట్
 చెన్నై: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఇండియా ఫ్యూచర్స్-3 టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బెరైడ్డి సాయిశరణ్ రెడ్డి, అశ్విన్ విజయరాఘవన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు.

మద్రాస్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)లో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్‌లో సాయిశరణ్ రెడ్డి 3-6, 6-2, 6-4తో నాలుగో సీడ్ అజయ్ సెల్వరాజ్ (భారత్)ను ఓడించగా... అశ్విన్ 6-0, 6-1తో జీవన్ (భారత్)పై గెలిచాడు. తొలి రౌండ్‌లో సాయిశరణ్ 6-2, 6-0తో నిశిత్ వకీల్ (భారత్)పై, అశ్విన్ 6-4, 6-4తో నెవన్ క్రివోకుకా (క్రొయేషియా)పై విజయం సాధించారు. సోమవారం జరిగే మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్‌లో శశికుమార్ ముకుంద్ (భారత్)తో సాయిశరణ్; సాగర్ అహూజా (భారత్)తో అశ్విన్ తలపడతారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement