మా బకాయిలు చెల్లించండి! | The wrestlers at the request of pro-wrestling league managers | Sakshi
Sakshi News home page

మా బకాయిలు చెల్లించండి!

Published Sun, Apr 10 2016 1:10 AM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM

మా బకాయిలు చెల్లించండి!

మా బకాయిలు చెల్లించండి!

ప్రొ రెజ్లింగ్ లీగ్ నిర్వాహకులను కోరిన రెజ్లర్లు
 
న్యూఢిల్లీ: ఐపీఎల్ తరహాలో జరిగిన ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్) ఏమేరకు విజయవంతమైందో కానీ అందులో పాల్గొన్న క్రీడాకారులతోపాటు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)కు కూడా నిర్వాహకులు ఇప్పటిదాకా పూర్తి డబ్బులు చెల్లించకపోవడం వివాదంగా మారింది. ఈ విషయంలో వెంటనే తమకు రావాల్సిన మొత్తాన్ని చెల్లించాల్సిందిగా పీడబ్ల్యూఎల్ నిర్వాహకులకు రెజ్లింగ్ సమాఖ్య లేఖ రాసింది. ఒక కోటి రూపాయలకు లీగ్ హక్కులను ‘ప్రొ స్పోర్టిఫై’కు రెజ్లింగ్ సమాఖ్య ఇచ్చింది. ఈ మొత్తంలో సగం ముందే చెల్లించగా మిగతా డబ్బు లీగ్ పూర్తయిన 90 రోజులలోపు చెల్లించేటట్టు ఒప్పందం ఉంది.

గతేడాది డిసెంబరు 10 నుంచి 27 వరకు ప్రొ రెజ్లింగ్ లీగ్ జరిగింది. అయితే ఇప్పటిదాకా మిగిలిన సగం మొత్తం సమాఖ్యకు అందలేదు. దీంతో పాటు లీగ్‌లో పాల్గొన్న స్వదేశీ, విదేశీ ఆటగాళ్లకు కూడా పూర్తి మొత్తం చెల్లించలేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని గత నెల 29న ‘ప్రొస్పోర్టిఫై’కు రాసిన లేఖలో 10 రోజుల్లోగా బకాయిలు చెల్లించాల్సిందిగా సమాఖ్య పేర్కొంది. అయితే ఈ విషయంలో స్పందించేందుకు ప్రొస్పోర్టిఫై డెరైక్టర్ విశాల్ గుర్నాని అందుబాటులోకి రావడం లేదు.

మరోవైపు యూపీ వారియర్స్ జట్టు సభ్యులు బబితా కుమారి (రూ.34.1 లక్షలు), సత్యవర్త్ కడియన్ (రూ.20 లక్షలు), విదేశీ రెజ్లర్ యూరీ మేయర్ ఇప్పటికే తమ బకాయిల విషయంపై ఫిర్యాదు చేశారు. వీరికే కాకుండా ఎలక్ట్రానిక్ స్కోరు బోర్డు, ఎల్‌ఈడీ స్క్రీన్స్‌ను ఏర్పాటు చేసిన వర్ణ డిస్‌ప్లే సిస్టమ్స్‌కు 50 లక్షలకు గాను 6.25 లక్షలు మాత్రమే నిర్వాహకులు చెల్లించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement