అమ్మాయిలూ తేల్చుకోవాలి...  | Today India will face New Zealand in the second T20 | Sakshi
Sakshi News home page

అమ్మాయిలూ తేల్చుకోవాలి... 

Published Fri, Feb 8 2019 2:24 AM | Last Updated on Fri, Feb 8 2019 2:24 AM

Today India will face New Zealand in the second T20 - Sakshi

ఆక్లాండ్‌: తొలి టి20లో పురుషుల జట్టులాగే ఓడిన భారత మహిళల జట్టు కూడా ఆతిథ్య కివీస్‌తో అమీతుమీకి సైఅంటోంది. నేడు జరిగే రెండో టి20లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. సిరీస్‌లో నిలవాలంటే గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో విశేష అనుభవజ్ఞురాలైన మిథాలీ రాజ్‌ను తుది జట్టులో ఆడించే అవకాశాలను టీమ్‌ మేనేజ్‌మెంట్‌ పరిశీలిస్తోంది. తొలి మ్యాచ్‌లో సాఫీగా లక్ష్యం దిశగా సాగుతున్న భారత్‌ అనూహ్యంగా 34 పరుగుల వ్యవధిలోనే 9 వికెట్లు కోల్పోయి ఓటమిని మూటగట్టుకుంది.

ఓపెనర్‌ స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్‌ మినహా ఎవరూ నిలబడలేకపోయారు. మరోవైపు  చేజారుతున్న మ్యాచ్‌ను కివీస్‌ జట్టు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చేతుల్లోకి తెచ్చుకుంది. ఇప్పుడు శుక్రవారం జరిగే మ్యాచ్‌తోనే సిరీస్‌నూ చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో ఒత్తిడంతా భారత బృందంపైనే ఉంది. ఈ మ్యాచ్‌లో భారత అమ్మాయిలు సర్వశక్తులు ఒడ్డాల్సిందే. లేదంటే మరో మ్యాచ్‌ ఆడకుండానే ప్రత్యర్థికి సిరీస్‌ను అప్పజెప్పాల్సి వస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement