ఆక్లాండ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మహిళల రెండో టీ-20 మ్యాచ్‌లో భారత్ టాస్‌ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. 20 ఓవర్లలో భారత్ స్కోరు 135/6 చేసింది. నయా సంచలనం జెమిమా రోడ్రిగ్స్ 53 బంతుల్లో 72 పరుగులతో మెరుపులు మెరిపించింది. ఆమెకు తోడుగా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన 27 బంతుల్లో 36 పరుగులతో రాణించి కీలక సమయంలో వెనుదిరిగింది. వేగంగా ఆడే క్రమంలో భారీ షాట్‌కు ప్రయత్నించి వికెట్ పారేసుకుంది. భారత్ మెరుగైన స్కోర్ చేయడంలో జెమిమా కీలక పాత్ర పోషించింది. 20 ఓవర్లకు కివీన్ ముందు 136 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్ధేశించింది. జెమిమా, మంధాన తప్ప మిగతా బ్యాటర్స్ రాణించపోవడంతో భారత్ భారీ స్కోర్‌ను సాధించలేకపోయింది.
మరో ఓపెనర్ పునియా గత మ్యాచ్ వైఫ్యల్యాన్నే కొనసాగిస్తూ 4 పరుగులకే తొలి వికెట్‌గా పెవిలియన్‌కు చేరింది. కీలక సమయంలో మిడిల్ ఆర్డర్ స్టార్ బ్యాటర్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా 5 పరుగులకే వెనుదిగింది. బ్యాటింగ్ మధ్యలో గాయం కారణంగా సుమలత మధ్యలోనే నిష్క్రమించింది. సిరీస్‌లో నిలవాలంటే గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో విశేష అనుభవజ్ఞురాలైన మిథాలీ రాజ్‌ను తుది జట్టులో చోటు లభించలేదు.
Comments
Please login to add a commentAdd a comment