
సిడ్నీ: ఊహించినట్లే టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్‌కు వర్షం అడ్డుపడింది. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎలెవెన్‌తో నాలుగు రోజుల మ్యాచ్‌లో తొలి రోజు బుధవారం ఆట ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. మంగళవారం రాత్రి నుంచే ప్రారంభమైన వాన ఎంతకూ తగ్గకపోవడంతో మైదానం చిత్తడిగా మారిపోయింది.
మధ్యాహ్న వేళ కొంత తెరిపినివ్వడంతో గ్రౌండ్స్‌మెన్ పిచ్, ఔట్ ఫీల్డ్ సిద్ధం చేసేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30కు టాస్ వేసి 4 గంటల నుంచి మ్యాచ్ ఆ డించాలని భావించారు. కానీ పరిశీలన తర్వాత అది సాధ్యం కాదని భావించి రద్దు చేశారు.