ట్విట్టర్లో అనుష్కపై కారాలు.. మిరియాలు | Twitterati targets Anushka over Virat's poor show in WC semis | Sakshi
Sakshi News home page

ట్విట్టర్లో అనుష్కపై కారాలు.. మిరియాలు

Published Thu, Mar 26 2015 4:26 PM | Last Updated on Sat, Sep 2 2017 11:26 PM

ట్విట్టర్లో అనుష్కపై కారాలు.. మిరియాలు

ట్విట్టర్లో అనుష్కపై కారాలు.. మిరియాలు

అత్యంత కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ కేవలం ఒకే ఒక్క పరుగు చేసి ఔట్ కావడంతో అభిమానులంతా అతడి ప్రేయసి అనుష్కాశర్మను తిట్టిపోస్తున్నారు.

అత్యంత కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ కేవలం ఒకే ఒక్క పరుగు చేసి ఔట్ కావడంతో అభిమానులంతా అతడి ప్రేయసి అనుష్కాశర్మను తిట్టిపోస్తున్నారు. ఈ మ్యాచ్ చూసేందుకు అనుష్క ప్రత్యేకంగా సిడ్నీ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. ఆమె వెళ్లిన ఈ మ్యాచ్లోనే విరాట్ కోహ్లీ అత్యంత దారుణంగా ఔటయిపోవడంతో.. అందరూ ఒక్కసారిగా మండిపడ్డారు.

సెమీఫైనల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లడం అనుష్కాశర్మ తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పని, ఆమెను యావద్దేశంలో ఏ ఒక్కరూ క్షమించరని అన్నారు. ఇటీవల ఓ వాణిజ్య ప్రకటనలో.. 'విరాట్.. ఐ వాంట్ యు హియర్ ఇన్ 5 మినిట్స్' అని ఉంటుంది.. ఇప్పుడు కూడా అనుష్క అలాగే అని ఉంటుందని, అందుకే ఒక్క పరుగు చేసి వెనక్కి వచ్చేసి ఉంటాడని కూడా తిట్టిపోశారు. తన ప్రియుడు విరాట్ ఒక్క పరుగు ఎలా చేస్తాడో చూసేందుకు లక్షలు ఖర్చుపెట్టుకుని మరీ అనుష్క సిడ్నీ వెళ్లిందని కూడా కొందరు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement