అండర్–17 ఫుట్‌బాల్ ప్రపంచకప్
అధికారిక గీతం ఆవిష్కరణ
ముంబై: ఈ ఏడాది అక్టోబరులో భారత్ ఆతిథ్యమివ్వనున్న ‘ఫిఫా’ అండర్–17 ప్రపంచకప్‌నకు సంబంధించి అధికారిక గీతాన్ని ఆవిష్కరించారు. ‘కర్‌కే దిక్లా దే గోల్’ అనే పేరుతో ఉన్న ఈ గీతాన్ని అమితాబ్ భట్టాచార్య రచించగా... ప్రీతమ్ సంగీత దర్శకత్వం వహించారు. ప్రముఖ సింగర్స్ సునిధి చౌహాన్, నీతి మోహన్, బాబుల్ సుప్రియో, షాన్, పాపోన్, మికాలు పాడారు.
మరోవైపు ఈ మ్యూజిక్ వీడియోలో ఫుట్‌బాల్ దృశ్యాలతో పాటు భారతీయ సంస్కృతిని చాటిచెప్పే వివిధ రాష్ట్రాల వేషధారణ, నృత్యంతో కళాకారులు అలరిస్తారు. సింగర్ షాన్, బాబుల్ సుప్రియో, బైచుంగ్ భూటియాతో పాటు చివర్లో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నమస్కారం పెడుతూ కనిపిస్తారు.