
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి వేద వర్షిత సత్తా చాటింది. సికింద్రాబాద్‌లోని వశిష్ట టెన్నిస్ అకాడమీలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో అండర్–18 బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో రెండు టైటిళ్లను కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన బాలికల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ వేద వర్షిత 4–6, 7–5, 7–5తో టాప్ సీడ్ పావని పాటక్‌కు షాకిచ్చింది. మూడున్నర గంటల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వర్షిత పోరాటం అందర్నీ ఆకట్టుకుంది.
మరోవైపు డబుల్స్ టైటిల్ పోరులో రెండో సీడ్ వేద వర్షిత– కుంకుమ్ నీల ద్వయం 7–6 (7/3), 6–4తో టాప్ సీడ్ అభయ– అపూర్వ వేమూరి (తెలంగాణ) జంటపై విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment