రామ్దిన్ కు షాక్
బసెటెర్రె (సెయింట్ కిట్స్): వెటరన్ వికెట్ కీపర్, మాజీ కెప్టెన్ దినేశ్ రామ్దిన్ కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(డబ్యూసీబీ) షాక్ ఇచ్చింది. టెస్టు జట్టు నుంచి అతడికి ఉద్వాసన పలికింది. భారత్ తో జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్కు ఎంపిక చేసిన విండీస్ టీమ్ లో అతడికి చోటు దక్కలేదు. అతడి స్థానంలో షేన్ డౌరిచ్ ను తీసుకున్నారు. తనను జట్టు నుంచి తప్పిస్తున్నట్టు విండీస్ సెలక్షన్ కమిటీ చైర్మన్ కర్టీ బ్రౌన్ ముందుగా సమాచారం ఇచ్చారని గతవారం రామ్దిన్ వెల్లడించాడు. తన ఉద్వాసను బ్రౌన్ కారణమంటూ మండిపడ్డాడు.
ఫాస్ట్ బౌలర్లు కీమర్ రోచ్, జెరోమ్ టేలర్ లను కూడా పక్కనపెట్టారు. మిడిలార్డర్ బ్యాట్స్మన్ రొస్టన్ ఛేజ్ తొలిసారిగా జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. ఎడంచేతి బ్యాట్స్ మన్ లియన్ జాన్సన్ కూడా జట్టులోకి వచ్చాడు.
విండీస్ టెస్ట్ టీమ్: జాసన్ హోల్డర్(కెప్టెన్), క్రెయిగ్ బ్రాత్వైట్(వైస్ కెప్టెన్), దేవేంద్ర బిషో, బ్లాక్వుడ్, కార్లోస్ బ్రాత్వైట్, డారెన్ బ్రావొ, రాజేంద్ర చంద్రిక, రొస్టన్ ఛేజ్, షేన్ డౌరిచ్, లియన్ జాన్సన్, మార్లన్ శామ్యూల్స్, షనన్ గాబ్రియల్