రికార్డు భాగస్వామ్యంతో అదరగొట్టారు | Record-breaking Ramdin, Bravo lead Windies to clean sweep | Sakshi
Sakshi News home page

రికార్డు భాగస్వామ్యంతో అదరగొట్టారు

Published Tue, Aug 26 2014 5:08 PM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM

రికార్డు భాగస్వామ్యంతో అదరగొట్టారు

రికార్డు భాగస్వామ్యంతో అదరగొట్టారు

బాస్సెటెరీ: బంగ్లాదేశ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను 3-0తో వెస్టిండీస్ క్లీన్ స్వీప్ చేసింది. బంగ్లాతో జరిగిన మూడో వన్డేలో విండీస్ 91 పరుగుల తేడాతో విజయం సాధించింది. దినేష్ రామ్దిన్, డారెన్ బ్రావో రికార్డు భాగస్వామ్యంతో జట్టుకు విజయాన్ని అందించారు. మూడో వికెట్ కు వీరిద్దరు 258 పరుగుల భాగస్వామ్యం జోడించారు. వన్డేల్లో విండీస్ తరపున ఏ వికెట్కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. అత్యుత్తమ భాగస్వామాల్లో ఇది ఐదో అతి పెద్దది.

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. బ్రేవో(124), రామ్దిన్(169) సెంచరీలతో చెలరేగారు. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ సిరీస్ రెండూ రామ్దిన్ దక్కించుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement