కోహ్లి, మాథ్యూస్ సమాన స్కోర్లు! | virat kohli, Angelo Mathews equal scores in Ranchi ODI | Sakshi
Sakshi News home page

కోహ్లి, మాథ్యూస్ సమాన స్కోర్లు!

Published Sun, Nov 16 2014 10:02 PM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM

కోహ్లి, మాథ్యూస్ సమాన స్కోర్లు!

కోహ్లి, మాథ్యూస్ సమాన స్కోర్లు!

రాంచీ: భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన ఇరు జట్ల కెప్టెన్లు విరాట్ కోహ్లి, ఎంజెలో మాథ్యూస్ సమాన స్కోర్లు సాధించారు. అంతేకాకుండా ఇద్దరూ నాటౌట్ గా నిలిచారు. మాథ్యూస్ 139, కోహ్లి 139 పరుగులు చేశారు.

ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. కెప్టెన్ మాథ్యూస్ అద్భుతంగా ఆడాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ దిగిన మాథ్యూస్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 116 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్సర్లతో 139 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

తర్వాత బ్యాటింగ్ దిగిన కోహ్లి కూడా సరిగ్గా 139 పరుగులే చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లి 126 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 139 పరుగులు సాధించాడు. మ్యాన్ ఆఫ్ మ్యాచ్(మాథ్యూస్), మ్యాన్ ఆఫ్ ద సిరీస్(కోహ్లి)లు వీరిద్దరికే దక్కడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement