
కోహ్లికి చేతికి బంతి ఇచ్చిన ధోని
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో మహేంద్ర సింగ్ ధోని ప్రయోగం చేశాడు. స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లితో బౌలింగ్ వేయించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. పవర్ ప్లే ముగిసిన తర్వాత కోహ్లికి చేతికి బంతి అందించాడు. 12 ఓవర్ వేసిన కోహ్లి వేసిన కోహ్లి 7 పరుగులిచ్చాడు.
స్మిత్, ఫించ్ భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు భారత బౌలర్లు శ్రమిస్తున్నారు. వార్నర్(12) స్వల్ప స్కోరుకే అవుటైనా స్మిత్, ఫించ్ నిలకడగా ఆడుతూ జట్టు స్కోరును 70 పరుగులు దాటించారు. రెండో వికెట్ కు వీరిద్దరూ 55 బంతుల్లో 53 పరుగులు జోడించారు.