
వరల్డ్ కప్ తో స్వదేశానికెళ్తే...
సిడ్నీ: ప్రపంచకప్ లో అందరి అంచనాలను తల్లకిందులు చేశామని టీమిండియా బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి అన్నాడు. ఎన్ని విమర్శులు వచ్చినా తాము ఆత్మవిశ్వాసం కోల్పోదని చెప్పాడు. వరల్డ్ కప్ కు ముందు ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమవడంతో తమపై విమర్శలు వెల్లువెత్తాయని, అయితే మెగా టోర్ని ప్రారంభమైన తర్వాత వరుస విజయాలతో ఎంతోమందిని ఆశ్చర్యానికి గురిచేశామని క్రికెట్ డాట్ కామ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లి చెప్పాడు.
అంతర్జాతీయ స్థాయిలో ఏ ఫార్మెట్ లో గెలవాలన్నా సామర్థ్యం, టాలెంట్ తో పాటు అనురక్తి(పాషన్) అవసరమని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా పర్యటనను ఫెయిల్యూర్ గా భావించలేదని, రాబోయే విజయాలకు సూచికగా తీసుకున్నామని అన్నాడు. తమ ఆట పట్ల గర్వంగా ఉన్నామని కోహ్లి పేర్కొన్నాడు. మరో ప్రపంచకప్ గెలిచేందుకు టీమిండియా చేరువయిందని అన్నాడు. ఆస్ట్రేలియాలో వరల్డ్ కప్ గెలిచి స్వదేశానికి తిరిగి వెళితే అదో గొప్ప అచీవ్ మెంట్ అవుతుందన్నాడు.