అభిమానుల మనసులు గెల్చిన కోహ్లి | Virat Kohli Enjoy With His Fans And Give Autographs | Sakshi
Sakshi News home page

దటీజ్‌ కోహ్లి అంటున్న అభిమానులు

Published Thu, Aug 23 2018 7:43 PM | Last Updated on Thu, Aug 23 2018 7:59 PM

Virat Kohli Enjoy With His Fans And Give Autographs - Sakshi

సెలబ్రిటీలకు అభిమానులతో  సెల్ఫీలు దిగడమన్నా, వారికి ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడమన్నా కాస్త ఇబ్బందే. కానీ టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి మాత్రం ఇందుకు భిన్నం. మైదానంలోనే కాకుండా, బయటకూడా అభిమానులను ఉత్తేజపరచటానికి కోహ్లి ఎప్పుడూ ముందుంటాడు. టీమిండియా సారథి వీరాభిమాని అయిన ఇంగ్లండ్‌ మహిళా క్రికెటర్‌ డానియెల్లి యాట్‌కు బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చి కోహ్లి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు.  మూడో టెస్టు విజయాన్ని కేరళ వరద బాధితులకు అంకితమిస్తున్నట్టు చెప్పి కోహ్లి తన ఉదారతను చాటుకున్న విషయం తెలిసిందే. నాటింగ్‌హామ్‌ టెస్టు అనంతరం స్టేడియం బయట అభిమానులు తమ అభిమాన క్రికెటర్ల కోసం ఎదురు చూస్తున్నారు.

మ్యాచ్‌ అనంతరం హోటల్‌కు వెలుతున్న సమయంలో మిగిలిన ఆటగాళ్లు బస్సు ఎక్కి కూర్చోగా.. కోహ్లి మాత్రం అభిమానులతో ఆనందం పంచుకోవడానికి వెళ్లాడు. దేశవిదేశీ అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. అయితే ఓ పిల్లవాడు మాత్రం  కోహ్లి.. కోహ్లి అంటూ బిగ్గరగా అరుస్తుండటంతో అది గమనించిన కోహ్లి ఆ పిల్లాడి దగ్గరికి వెళ్లి ఆటోగ్రాఫ్‌తో పాటు, సెల్ఫీ కూడా ఇచ్చాడు. ఇప్పుడా వీడియో సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. కోహ్లికి అభిమానుల పట్ల ఉన్న నిబద్దతకు అందరూ దటీజ్‌ కోహ్లి అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. గతంలో కూడా మిగతా క్రికెటర్లు అభిమానులను పట్టించుకోకుండా వెళ్లినా.. కోహ్లి మాత్రం ఫ్యాన్స్‌కు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement