లండన్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్-బిలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి విఫలమయ్యాడు. ఐదు బంతుల్ని ఎదుర్కొన్న కోహ్లి డకౌట్ గా పెవిలియన్ చేరి నిరాశపరిచాడు. నువాన్ ప్రదీప్ బౌలింగ్ లో కీపర్ డిక్ వెల్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
రోహిత్ శర్మ(78; 79 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) తొలి వికెట్ గా వెనుదిరిగిన తరువాత క్రీజ్ లోకి వచ్చిన కోహ్లి షాట్ యత్నించి పెవిలియన్ కు చేరాడు. ఈ మ్యాచ్ లో రోహిత్-శిఖర్ ధావన్ ల జోడి శుభారంభాన్ని అందించింది. ఈ జోడి 138 పరుగుల భాగస్వామ్యాన్నిసాధించి భారత్ భారీ స్కోరుకు బాటలు వేసింది.