
విరాట్ కోహ్లి
లండన్: టెస్ట్ క్రికెట్‌ను కాపాడాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆయా దేశాల క్రికెట్ బోర్డులకు విజ్ఞప్తి చేశాడు. క్రికెట్‌లో మరో కొత్త ఫార్మాట్‌ను స్వాగతించలేనని, అందులో భాగస్వామిని కాలేనని స్పష్టం చేశాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) 100 బాల్ ఫార్మాట్‌కు తెరతీసిన నేపథ్యంలో విజ్డెన్ క్రికెట్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లి ఇలా వ్యాఖ్యానించాడు. వాణిజ్య అంశాలు క్రికెట్‌ను దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు.
‘నేను ఆవేశంతో మాట్లాడటం లేదు, కానీ కొన్ని సార్లు విపరీతమైన క్రికెట్ ఆడటంతో విసుగు వస్తుందన్నారు. వాణిజ్య అంశాలు ఆటను దెబ్బతీయడం నాకు బాధను కలిగిస్తోంది. ప్రస్తుతం నాకు ఎలాంటి కొత్త ఫార్మాట్ ఆడాలని లేదు. ఈసీబీలాంటి బోర్డు కొత్త ఫార్మాట్‌ను తెరపైకి తెస్తుండటం ఆసక్తి రేపుతున్నా.. నాకు మాత్రం ఈ కొత్త ఫార్మాట్‌పై ఆసక్తి లేదు. ఆ ఫార్మాట్‌ను లాంచ్ చేయబోయే జట్టులో నేను ఉండను. ఓ టెస్ట్ ప్లేయర్‌గా ఏ కొత్త ఫార్మాట్‌కు మారాలని అనుకోవడం లేదు. నేను ఐపీఎల్ ఆడటాని, బీబీఎల్ చూడటాన్ని ఆస్వాదిస్తాను. అన్నీ లీగ్‌లకు మద్దతిస్తాను కాని.. ఇలాంటి ప్రయోగాలకు కాదు.’ అని కోహ్లి అభిప్రాయపడ్డాడు.
క్రికెట్ బోర్డులు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వకపోతే క్రికెట్ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని హెచ్చరించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ బోర్డులు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని టెస్టు క్రికెట్‌ను కాపాడాలని విజ్ఞప్తి చేశాడు. ఐదు టెస్టు సిరీస్‌లో భాగంగా కోహ్లిసేన ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. 2-1తో ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ ఆధిక్యంలో ఉండగా.. నాలుగో టెస్టు గురువారం నుంచి ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment