ధోనీ కంటే విరాటే పాపులర్ | Virat Kohli overtakes MS Dhoni as most popular sportsman on social media | Sakshi
Sakshi News home page

ధోనీ కంటే విరాటే పాపులర్

Published Mon, Apr 4 2016 12:23 PM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

ధోనీ కంటే విరాటే పాపులర్ - Sakshi

ధోనీ కంటే విరాటే పాపులర్

న్యూఢిల్లీ: ధనార్జనలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని దాటిపోయిన యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ మరో ముందడుగు వేశాడు. సోషల్ మీడియాలో అత్యంత పాపులారిటీ గల భారత్ క్రీడాకారుడు కోహ్లీనే కావడం విశేషం. ప్రస్తుతం ధోనీ కంటే కోహ్లీకే ఎక్కువ పాపులారిటీ ఉంది.

ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో మోస్ట్ ట్రెండింగ్ స్పోర్ట్స్ మన్ కోహ్లీనే. టి-20 ప్రపంచ కప్లో అద్భుతంగా రాణించి, టీమిండియా సెమీస్కు చేరడంలో కీలకపాత్ర పోషించిన విరాట్ గురించి సోషల్ మీడియాలో ఎక్కువ చర్చించుకున్నారు. కోహ్లీకి అభినందలు తెలుపుతూ లక్షలాది కామెంట్లు పోస్ట్ చేశారు. మార్చి నెలలో కోహ్లీ గురించి రికార్డు స్థాయిలో దాదాపు 12 లక్షల కన్వర్జేషన్స్ ఉన్నాయి. ధోనీ(7 లక్షలు)తో పోలిస్తే చాలా ఎక్కువ.

'భారత్లో కన్వర్ జేషన్ వాల్యూమ్ ఎప్పుడూ 1.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటుంది. 10, 12 లక్షల మధ్యకు చేరడం ఇదే తొలిసారి. కోహ్లీ ఆధిక్యంలో ఉన్నారు' అని సోషల్ మీడియా ట్రాకర్ ఆటమ్న్ వరల్డ్ వైడ్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ అనూష శెట్టి చెప్పారు. ట్విట్టర్లో కోహ్లీకి కోటి 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉండగా, ధోనీకి 52 లక్షలా 70 వేలమంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement