
వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లి ‘టాప్’
దుబాయ్: భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకుల్లో కోహ్లి 881 రేటింగ్ పాయింట్లతో డివిలియర్స్‌ను వెనక్కినెట్టి నంబర్‌వన్ ర్యాంకుకు చేరుకున్నాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు అతడు అగ్రస్థానంలో ఉన్నాడు.
ఆ తర్వాత రెండో ర్యాంకుకు పడిపోయిన కోహ్లి, ఆసియాకప్‌లో రాణించడం ద్వారా ర్యాంకును మెరుగుపర్చుకున్నాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ మూడు ర్యాంకులు ఎగబాకి ఎనిమిదో స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ 22 (+1), జడేజా 50 (+12) ర్యాంకుకు చేరుకున్నారు. బౌలర్ల ర్యాంకుల్లో జడేజా నాలుగు స్థానాలు ఎగబాకి ఐదో ర్యాంకులో నిలిచాడు.
భారత్‌కు రెండో స్థానం...
మరోవైపు ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకుల్లో భారత జట్టు రెండో స్థానంలో నిలిచింది. ఏప్రిల్ 1 కటాఫ్ తేదీ వరకు తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు ఐసీసీ ప్రైజ్‌మనీని అందజేస్తుంది. 113 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న భారత్‌కు రూ. 45 లక్షలు, అగ్రస్థానాన్ని ఖాయం చేసుకున్న ఆస్ట్రేలియా (117 పాయింట్లు)కు రూ. 1.05 కోట్లు దక్కనున్నాయి.