సచిన్ ను అధిగమించిన కోహ్లీ! | virat Kohli surpasses Tendulkar on Twitter to head list | Sakshi
Sakshi News home page

సచిన్ ను అధిగమించిన కోహ్లీ!

Published Tue, Dec 23 2014 5:49 PM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM

సచిన్ ను అధిగమించిన కోహ్లీ!

సచిన్ ను అధిగమించిన కోహ్లీ!

న్యూఢిల్లీ:విరాట్ కోహ్లీ.. టీమిండియా యువ క్రికెటర్. భావి కెప్టెన్ గా ముందుకు దూసుకుపోతున్న కోహ్లీ తాజాగా మరో రికార్డును అధిగమించాడు. అది కూడా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు కావడం గమనార్హం.  భారత్ లోని క్రీడాకారుల జాబితాకు సంబంధించి ట్విట్టర్ లో అధిక సంఖ్యలో ఫాలోయింగ్ కల్గిన  ఆటగాడిగా కోహ్లీ సరికొత్త రికార్డును నెలకొల్పాడు.  ప్రస్తుతం 48,70, 190 మంది ట్విట్టర్ ఫాలోవర్స్ ను కల్గిన కోహ్లీ ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు.  అయితే సచిన్  48,69,849 ఫాలోవర్స్ తో రెండో స్థానానికి పడిపోయాడు. ఇదిలా ఉండగా టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 33, 27,033 మంది ట్విట్టర్ అభిమానుల్ని సొంతం చేసుకుని మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

 

కాగా, డాషింగ్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్ కు దూరమైనా ట్విట్టర్ ఫాలోవర్స్ లో మాత్రం దూసుకుపోతున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ 31 లక్షలకు పైగా ట్విట్టర్ అభిమానులను సంపాదించుకుని నాల్గో స్థానంలో నిలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement