
న్యూఢిల్లీ: ఎప్పుడూ ట్వీటర్‌లో సెటైర్‌లను సంధిస్తూ చురుగ్గా ఉండే భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్..పరుగుల యంత్రం విరాట్ కోహ్లి ఎన్ని వన్డే సెంచరీలు సాధిస్తాడు అనే దానిపై జోస్యం చెప్పాడు. ట్వీటర్ వేదికగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబిచ్చిన సెహ్వాగ్..తన కెరీర్ ముగిసేనాటికి విరాట్ ఎన్ని వన్డే శతకాలు నమోదు చేస్తాడు అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు తడుముకోకుండా జవాబిచ్చాడు.
విరాట్ తన కెరీర్ ముగిసేసమయానికి 62వన్డే సెంచరీలు సాధించడం ఖాయమని సెహ్వాగ్ పేర్కొన్నాడు. అదే సమయంలో తన క్రికెట్ కెరీర్‌లో ఫేవరెట్ మూమెంట్ ఏమిటి? అనే ప్రశ‍్నకు వరల్డ్ కప్‌ను గెలవడమని సెహ్వాగ్ బదులిచ్చాడు. మరొకవైపు 2019 వరల్డ్ కప్‌ను భారత్ గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయని మరొక అభిమానికి స్పష్టం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment