న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని బీఎస్‌ఎఫ్ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోనుంది. దేశంలోని రెండో అతిపెద్ద పారామిలటరీ దళానికి అతను ప్రచారకర్తగా సేవలందించే అవకాశాన్ని పొందాడు. త్వరలోనే సీనియర్ అధికారుల సమక్షంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించి అతన్ని అధికారికంగా నియమించుకుంటారు. ఈ కార్యక్రమంలో బీఎస్‌ఎఫ్ చీఫ్ సుభాష్ జోషి, ఇతర అధికారులు పాల్గొంటారు.
దళంలో యువతను ఆకర్షించేందుకు ఈ నియామకం తమకు దోహదం చేస్తుందని బీఎస్‌ఎఫ్ వర్గాలు భావిస్తున్నాయి. భారత్ నెగ్గిన 2011 వన్డే ప్రపంచకప్‌లో విశేషంగా రాణించిన 25 ఏళ్ల కోహ్లి ఇప్పటికే భావి కెప్టెన్‌గా పలువురి కితాబు అందుకుంటున్న సంగతి తెలిసిందే.