లండన్: ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ పేలవ ఆటతీరుతో మూల్యం చెల్లించుకున్నాడు. లండన్ క్లాసిక్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఆనంద్ ఓటమిపాలయ్యాడు. దీంతో టోర్నీ నుంచి నిష్ర్కమించాడు.
రష్యాకు చెందిన వ్లాదిమిర్ క్రామ్నిక్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆనంద్ 0.5-1.5 తేడాతో పరాజయం చెందాడు. తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న ఆనంద్... రెండో గేమ్‌లో తెల్లపావులతో ఆడుతూ 27 ఎత్తుల్లో ఓడిపోయాడు. క్వార్టర్స్ వరకు ఆనంద్ ఆటతీరు మెరుగ్గానే సాగినా కీలకమైన తరుణంలో తడబడ్డాడు. సెమీఫైనల్లో క్రామ్నిక్.. నకమురాతో, గెల్ఫాండ్.. ఆడమ్స్‌తో తలపడనున్నారు.
ఆనంద్ నిష్ర్కమణ
Published Mon, Dec 16 2013 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM
Advertisement
Advertisement