
కాస్పరోవ్, ఆనంద్‌లకు నిరాశ
సెయింట్ లూయిస్ (అమెరికా): ప్రపంచ మాజీ చాంపియన్స్ గ్యారీ కాస్పరోవ్ (రష్యా), విశ్వనాథన్ ఆనంద్ (భారత్)... సెయింట్ లూయిస్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో నిరాశాజనక ప్రదర్శన కనబరిచారు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో కాస్పరోవ్ పదో స్థానంలో, ఆనంద్ తొమ్మిదో స్థానంలో నిలువడం గమనార్హం.
3.5 పాయింట్లతో డేవిడ్ నవారా (చెక్ రిపబ్లిక్), కాస్పరోవ్, ఆనంద్ సంయుక్తంగా ఎనిమిదో స్థానంలో నిలిచారు. అయితే సాధించిన విజయాల సంఖ్య, ముఖాముఖి గేమ్‌ల ఫలితాల ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... నవారా ఎనిమిదో స్థానంలో, ఆనంద్ తొమ్మిదో స్థానంలో, కాస్పరోవ్ పదో స్థానంలో నిలిచారు. ఆరు పాయింట్లు సాధించిన లెవాన్ అరోనియన్ (అర్మేనియా) టైటిల్‌ను దక్కించుకున్నాడు.