వైజాగ్‌లో ‘పచ్చిక’ లేదు!
విశాఖపట్నం: ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో భారత స్పిన్నర్లు ప్రభావం చూపలేకపోవడంతో సిరీస్‌లోని తర్వాతి టెస్టులు జరిగే పిచ్‌లపై అందరి దృష్టీ నిలిచింది. ఇప్పుడు రెండో టెస్టు జరిగే విశాఖపట్నంలో స్పిన్‌కు అనుకూలమైన పిచ్ రూపొందించే అవకాశం కనిపిస్తోంది. ‘పిచ్‌పై పెద్దగా పచ్చిక ఉండకపోవచ్చు. రెండో రోజు లంచ్ సమయం నుంచే బంతి టర్న్ అయ్యే అవకాశం ఉంది’ అని బీసీసీఐ క్యురేటర్ కస్తూరి శ్రీరామ్ వ్యాఖ్యానించారు.
వైజాగ్‌లో వైఎస్‌ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలోని వికెట్ సోమవారం ఇప్పటికే బాగా పొడిగా మారిపోరుుంది. ఏసీఏ కార్యదర్శి గోకరాజు గంగరాజు మాత్రం ఇరు జట్లకూ పిచ్ సమానంగా అనుకూలిస్తుందని, ఫలితం తేల్చే వికెట్‌కు రూపొందిస్తున్నామని చెప్పారు. భారత్, ఇంగ్లండ్ మధ్య ఈ నెల 17నుంచి ఇక్కడ రెండో టెస్టు జరుగుతుంది. రాజ్‌కోట్ టెస్టులో భారత స్పిన్నర్లు 57.88 సగటుతో 9 వికెట్లు తీయగా, ఇంగ్లండ్ స్పిన్నర్లు 33.30 సగటుతో 13 వికెట్లు పడగొట్టారు.