
'పాకిస్థాన్ క్రికెట్ చచ్చిపోతుంది'
పాకిస్థాన్ లో క్రికెట్ ఉనికి ప్రమాదంలో పడిందని పాకిస్థాన్ కోచ్ వకార్ యూనిస్ ఆందోళన వ్యక్తం చేశాడు.
సిడ్నీ: పాకిస్థాన్ లో క్రికెట్ ఉనికి ప్రమాదంలో పడిందని పాకిస్థాన్ కోచ్ వకార్ యూనిస్ ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రత్యర్థి టీమ్ లు తమ దేశంతో ఆడకుంటే పాకకిస్థాన్ లో క్రికెట్ చచ్చిపోయే ప్రమాదముందని వాపోయాడు. 2009 నుంచి పాకిస్థాన్ లో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా జరగలేదు. అదే ఏడాది మార్చిలో పాక్ పర్యటనకు వచ్చిన శ్రీలంక జట్టుపై లాహోర్ లో తీవ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు.
అంతర్జాతీయ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వలేకపోవడం పెద్ద ఎదురుదెబ్బ అని వకార్ పేర్కొన్నాడు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పాక్ క్రికెట్ ఉనికికి ప్రమాదం వాటిల్లే అవకాశముందని అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ మ్యాచ్ లు నిర్వహించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరాడు.