
కరాచీ: తమ ప్రతిభను మరింత మెరుగు పరుచుకోవడం కోసం చాలా మంది క్రికెటర్లు ఇంగ్లిష్ కౌంటీల వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. తమ దేశంలో ఎంతటి స్టార్ క్రికెటర్లైనా ఇంగ్లిష్ కౌంటీలు ఆడటాన్ని హుందాగా స్వీకరిస్తారు. ఇలా ఇంగ్లిష్ కౌంటీలు ఆడిన ప్రధాన భారత క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్, సౌరవ్ గంగూలీ, అజింక్యా రహానే, యువరాజ్ సింగ్, చతేశ్వర పుజారా తదితరులు ఉన్నారు. అయితే ప్రస్తుతం టీమిండియా పేస్ బౌలింగ్ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్న జస్‌ప్రీత్ బుమ్రాకు మాత్రం కౌంటీలు ఆడాల్సిన అవసర లేదంటున్నాడు పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్. బుమ్రా ఇంగ్లిష్ కౌంటీలు ఆడటం కంటే విశ్రాంతి తీసుకుంటేనే మంచిదని సలహా ఇచ్చాడు. ఇప్పటికే మూడు ఫార్మాట్ల క్రికెట్ ఆడుతూ బిజీగా ఉన్న బుమ్రాకు ఇంగ్లిష్ కౌంటీ ఆడాల్సిన అవసరం ఏమాత్రం లేదని అభిప్రాయపడ్డాడు. (ఆ రచ్చ ఇప్పుడెందుకో..?)
దాంతో అతి పెద్ద లీగ్ అయిన ఐపీఎల్‌లో కూడా బుమ్రాది అతి పెద్ద రోల్ కాబట్టి, కౌంటీల జోలికి వెళ్లాల్సిన అవసరం లేదన్నాడు. తనకు దొరికిన ఖాళీ సమయంలో విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందన్నాడు. బుమ్రా ఒక టాప్ బౌలర్ అనడంలో ఎటువంటి సందేహం లేదంటూ కొనియాడాడు. ప్రస్తుత ప్రపంచ టాప్ బౌలర్లలో బుమ్రా కూడా ఒకడని ప‍్రశంసించాడు. ఇక టీ20 ఫార్మాట్ నుంచి బౌలర్లు నేర్చుకునేది ఏమీ ఉండదన్నాడు. టీ20 ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్ల ప్రతిభను తాను జడ్జ్ చేయలేనన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్ ద్వారానే క్రికెటర్ల ప్రతిభను గుర్తించగలనన్నాడు. కాగా, తాను క్రికెట్ ఆడే తొలి రోజుల్లో తన టాలెంట్‌ను ఇమ్రాన్ భాయ్, మియాందాద్ భాయ్, ముదాసర్ నజార్‌లు మాత్రమే గుర్తించారన్నాడు. ఈ కుర్రాడిలో టాలెంట్ ఉందని వారు పదే పదే చెబుతూ ఉండేవారని, అది తనకు అర్థం అయ్యేది కాదని గత జ‍్క్షాపకాల్ని గుర్తు చేసుకున్నాడు. ఈ ముగ్గుర్నీ వేరు వేరు విషయాలను నేర్చుకున్నానన్నాడు. అయితే తాను టాలెంట్ అనే ట్యాగ్‌ను ఎంజాయ్ చేసేవాడినని అక్రమ్ తెలిపాడు. (హార్డ్ హిట్టర్‌పై ఆరేళ్ల నిషేధం)
Comments
Please login to add a commentAdd a comment