చివరి వన్డేలో వారి కామెంట్స్ ఉండవు! | Wasim Akram, Shoaib Akhtar to return to Pakistan after ICC withdraws Aleem Dar | Sakshi
Sakshi News home page

చివరి వన్డేలో వారి కామెంట్స్ ఉండవు!

Published Tue, Oct 20 2015 9:47 AM | Last Updated on Sun, Sep 3 2017 11:15 AM

చివరి వన్డేలో వారి కామెంట్స్ ఉండవు!

చివరి వన్డేలో వారి కామెంట్స్ ఉండవు!

న్యూఢిల్లీ: భారత్-దక్షిణాఫ్రికా సిరీస్ లో కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్లు వసీం అక్రమ్, షోయబ్ అక్తర్ చివరి ఐదో వన్డేకు అందుబాటులో ఉండడం లేదు. స్వదేశానికి వారు తిరిగి వెళ్లనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. భద్రతా కారణాలతో పాకిస్థాన్ అంపైర్ అలీమ్ దార్ ను ఐసీసీ వెనక్కు పిలిచిన నేపథ్యంలో అక్రమ్,  అక్తర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ముంబైలోని బీసీసీఐ కార్యాలయంలోకి శివసేన కార్యకర్తలు చొచ్చుకెళ్లి  హంగామా సృష్టించడంతో అలీమ్ దార్ ను వెనక్కి పిలిపిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. పాకిస్థాన్ తో సిరీస్ వద్దంటూ శివసేన కార్యకర్తలు సోమవారం బీసీసీఐ కార్యాలయాన్ని ముట్టడించారు. ఐదో వన్డేలో ముంబైలో జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement