క్రికెట్‌ అభిమానులకు ‘జియో’ గుడ్‌ న్యూస్‌ | Watch Team India South Africa Series On Jio Tv | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ అభిమానులకు ‘జియో’ గుడ్‌ న్యూస్‌

Sep 13 2019 6:30 PM | Updated on Sep 13 2019 6:37 PM

Watch Team India South Africa Series On Jio Tv - Sakshi

ముంబై : క్రీడల్లో క్రికెట్‌కు ఉన్న క్రేజే వేరు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు టీమిండియా మ్యాచ్‌లను తప్పక చూడాలని ఆరాటపడతారు. అయితే అందరికీ మ్యాచ్‌లను చూసే అవకాశం లభించదు. మొబైల్‌, డెస్క్‌టాప్‌లలో మ్యాచ్‌లను వీక్షించే సౌలభ్యం అందరికీ ఉండదు. అయితే యావత్‌ క్రికెట్‌ అభిమానులకు జియో తీపి కబురు తీసుకొచ్చింది. సెప్టెంబర్‌ 15 నుంచి ప్రారంభం కానున్న టీమిండియా- దక్షిణాఫ్రికా సిరిస్‌ను జియో టీవీలో ఉచితంగా అన్ని ప్రాంతీయ భాషల్లో వీక్షించవచ్చు​. ఈ విషయాన్ని జియో అధికారికంగా ప్రకటించింది. దీనికోసం స్టార్‌ ఇండియాతో జియో టైఅప్‌ అయింది. 

ఇప్పటివరకు క్రికెట్‌ మ్యాచ్‌లను ఆన్‌లైన్‌లో చూడాలంటే కొంత డబ్బు చెల్లించాల్సి ఉండేది. దీంతో కొంత మంది మాత్రమే మ్యాచ్‌లను వీక్షించేవారు. కానీ జియో తన యూజర్లకు ఉచితంగా క్రికెట్‌ను చూసే సౌలభ్యం కల్పించింది. దీనికోసం జియో యూజర్లు గూగుల్‌ ప్లేస్టోర్‌/యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి జియో టీవీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడమే. అంతే కాకుండా జియో క్రికెట్‌ హెచ్‌డీ అనే ఛానల్‌ను కూడా జియో టీవీ అందుబాటులోకి తీసుకొచ్చింది. క్రికెట్‌ ప్రాంతీయ అభిమానుల కోసం ఇంగ్లీష్‌, హిందీ భాషలతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ కామెంటరీ అందించనుంది. జియో యూజర్లు కాని వారికి కూడా మై జియో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే మ్యాచ్‌ స్కోర్‌, సిరీస్‌ విషయాలను తెలుసుకోవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement