
కోలుకుంటాం: మెండిస్
కోల్‌కతా: భారత్‌తో ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయినా... చివరి రెండు వన్డేల్లో కోలుకుని పరువు దక్కించుకుంటామని శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండిస్ అన్నాడు. ‘ఈ సిరీస్ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లు ఆడాలి. కాబట్టి చివరి రెండు వన్డేల్లో గెలిచి, ఆ సిరీస్‌కు ధీమాగా వెళ్లాలని భావిస్తున్నాం’ అని చెప్పాడు. చివరి రెండు వన్డేల కోసం మెండిస్ జట్టులో చేరాడు.
గురువారం జరిగే నాలుగో వన్డేలో ట్రాక్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉందని మెండిస్ తెలిపాడు. ‘ఈ పిచ్ ప్రతిసారీ స్పిన్నర్లకు సహకరిస్తుంది. గతంలో ఐపీఎల్‌లో కోల్‌కతాకు ఆడినప్పుడు ఈడెన్ గురించి తెలుసుకున్నాను’ అని చెప్పాడు.