
ద్రవిడ్ సేవలను వినియోగించుకుంటాం
భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ సేవలను కూడా వినియోగించుకుంటామని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ‘అంత గొప్ప క్రికెటర్ సేవలు కచ్చితంగా అవసరం. అందరినీ ఒకే ప్యానల్‌లో నియమించాలనేం లేదు. ద్రవిడ్ సేవలు ఎప్పుడు ఎలా వినియోగించుకుంటామనేది సమయం వచ్చినప్పుడు చెబుతాం’ అని ఠాకూర్ చెప్పారు. సచిన్, లక్ష్మణ్, గంగూలీలతో సలహా కమిటీని బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే.