కరీబియన్ మహిళలు తొలిసారి... | West Indies womens World Cup final | Sakshi
Sakshi News home page

కరీబియన్ మహిళలు తొలిసారి...

Published Fri, Apr 1 2016 1:08 AM | Last Updated on Sun, Sep 3 2017 8:57 PM

కరీబియన్ మహిళలు తొలిసారి...

కరీబియన్ మహిళలు తొలిసారి...

► ప్రపంచకప్ ఫైనల్లో వెస్టిండీస్
► సెమీస్‌లో 6 పరుగులతో న్యూజిలాండ్ ఓటమి

 ముంబై నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి: టి20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ మహిళల జట్టు తొలిసారిగా ఫైనల్లోకి ప్రవేశించింది. అంచనాలకు మించి రాణించిన ఆ జట్టు గురువారం ఇక్కడ జరిగిన రెండో సెమీ ఫైనల్లో పటిష్టమైన న్యూజిలాండ్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. బ్రిట్నీ కూపర్ (48 బంతుల్లో 61; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీతో చెలరేగగా, స్టెఫానీ టేలర్ (26 బంతుల్లో 25; 2 ఫోర్లు) రాణించింది. కివీస్ బౌలర్లలో సోఫీ డెవిన్ 22 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది.

 అనంతరం న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. సారా మెక్‌గ్లాషన్ (30 బంతుల్లో 38; 2 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. సాటర్‌వెయిట్ (24), డెవిన్ (22) ఫ ర్వాలేదనిపించారు. స్టెఫానీ టేలర్‌కు 3 వికెట్లు దక్కా యి. విండీస్ చక్కటి బౌలింగ్, అద్భుత ఫీల్డింగ్‌తో కివీస్‌ను కట్టి పడేసింది. ఆదివారం కోల్‌కతాలో జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో వెస్టిండీస్ తలపడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement