అందర్నీ క్షమిస్తా.. కానీ మర్చిపోను! | Will not forget what UEFA did against me, Blatter | Sakshi
Sakshi News home page

అందర్నీ క్షమిస్తా.. కానీ మర్చిపోను!

Published Sat, May 30 2015 3:58 PM | Last Updated on Fri, Jun 15 2018 4:33 PM

అందర్నీ క్షమిస్తా.. కానీ మర్చిపోను! - Sakshi

అందర్నీ క్షమిస్తా.. కానీ మర్చిపోను!

జ్యురిచ్: యూనియన్  ఆఫ్ యూరోపియన్ ఫుట్ బాల్ అసోసియేషన్ (యూఈఎఫ్ఎ) నుంచి తనకు వచ్చిన బెదిరింపులపై ఫిఫా నూతన అధ్యక్షుడు సెప్ బ్లాటర్ స్పందించాడు. తనకు వ్యతిరేకంగా యూఈఎఫ్ఏ అనేక రకాలైన ఆరోపణలు స్పష్టించడం అత్యంత బాధ కల్గించిందని పేర్కొన్నాడు. వారు ఆరోపణలు చేసేంది కేవలం ఒక వ్యక్తిపై కాదు..  మొత్తం వ్యవస్థనే  విషయం గుర్తించుకోవాలని బ్లాటర్ తెలిపారు.ఈ ఘటనను తాను ఎప్పటికీ మర్చిపోలేనన్నాడు.

 

'నాపై యూఈఎఫ్ఎ అనవసర రాద్దాంతం చేసింది. అది నిజంగా సిగ్గు చేటు. ఒక్కడ్నే లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడ్డారు. అది నా ఒక్కడికే సంబంధించినది కాదు. యావత్ ఫుట్ బాల్ వ్యవస్థనే కించపరిచినట్లుగా ఉంది.అయితే దీనిపై అందర్నీక్షమిస్తా. కాకపోతే ఈ చర్యలను మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను' అని బ్లాటర్ తెలిపాడు.

 

శుక్రవారం జరిగిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అధ్యక్ష ఎన్నికల్లో బ్లాటర్...  జోర్డాన్ ప్రిన్స్ బిన్ అల్ హుస్సేన్‌పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 209 మంది సభ్యులు పాల్గొన్న ఈ ఓటింగ్ లో బ్లాటర్ విజయాన్ని చేజిక్కించుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement