నార్త్‌సౌండ్: ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు మరో షాకిచ్చింది వెస్టిండీస్. తొలి టెస్టులో గెలిచిన వెస్టిండీస్.. అదే జోరును రెండో టెస్టులో కూడా కొనసాగించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. సర్ వివ్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఇంగ్లండ్‌ను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రెండొందల పరుగుల లోపే ఆలౌట్ చేసిన విండీస్.. ఆపై 14 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించింది. దాంతో సిరీస్‌ను ఇంకో టెస్టు మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుంది. అదే సమయంలో స్వదేశంలో 10 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్‌ను చేజిక్కించుకుంది. 2009 తర్వాత సొంత గడ్డపై ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్‌ను గెలవడం విండీస్‌కు ఇదే ప్రథమం.
ఇంగ్లండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 132 పరుగులకే కుప్పకూల్చిన విండీస్ విజయానికి మార్గం సుగుమం చేసుకుంది. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 306 పరుగులు చేసింది. తొలి టెస్టులో వెస్టిండీస్ 381 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment