విజేత రాజ్‌మోహన్ | Winner Rajmohan | Sakshi
Sakshi News home page

విజేత రాజ్‌మోహన్

Published Mon, Mar 3 2014 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 4:19 AM

విజేత రాజ్‌మోహన్

విజేత రాజ్‌మోహన్

 జింఖానా,లాంకో హిల్స్ ఇండియా ఓపెన్ రాకెట్‌బాల్ సింగిల్స్ టెన్నిస్ చాంపియన్‌షిప్ పురుషుల ఓపెన్‌లో రాజ్‌మోహన్ విజేతగా నిలిచాడు. ఇటీవల జరిగిన ఈ టోర్నీలో రాజ్‌మోహన్ 15-8, 15-7తో శ్రీకరన్‌పై విజయం సాధించాడు.

పురుషుల ‘ఎ’ విభాగంలో చాకో చెరియన్ 15-8, 15-6తో శ్రీనివాస్ అవసరాలపై గెలిచి టైటిల్ దక్కించుకున్నాడు. ‘బి’ విభాగంలో వంశీ వారణాసి 15-8, 15-5తో పుట్ట రవిపై నెగ్గి ప్రథమ స్థానంలో నిలిచాడు. ‘సి’ విభాగంలో అమిత గోండి 15-13, 15-6తో పుట్ట రవిపై గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ‘డి’ విభాగంలో అనిల్ ఖాజా 7-15, 15-11, 11-8తో వినయ్‌పై గెలుపొంది టైటిల్ సాధించాడు.

బాలుర అండర్-18 విభాగంలో సాహిత్ మందాల 15-12, 15-9తో కారుమంచి నీరజ్‌ని ఓడించి విజేతగా నిలిచాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement