
భారత్, దక్షిణాఫ్రికా హాకీ మ్యాచ్ డ్రా
మహిళల హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నమెంట్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్ 0–0తో డ్రాగా ముగిసింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. ప్రారంభం నుంచి హోరాహోరీగా తలపడిన రెండు జట్లు గోల్స్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు.
తమకు లభించిన రెండు పెనాల్టీ కార్నర్‌లను భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. అటు ప్రొటీస్ ఎదురుదాడికి దిగడంతో చాలా అవకాశాలు వచ్చినా వాటిని గోల్స్‌గా మలచలేకపోయింది.