లిస్ట్ ‘ఎ'లో ప్రపంచ రికార్డు భాగస్వామ్యం
బ్లూమ్‌ఫోంటీన్: లిస్ట్ ‘ఎ' క్రికెట్‌లో శుక్రవారం కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. దక్షిణాఫ్రికా దేశవాళీ వన్డేలో భాగంగా డాల్ఫిన్స్, నైట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటు చేసుకుంది. డాల్ఫిన్స్ ఆటగాళ్లు మోర్నీ వాన్ విక్ (171 బంతుల్లో 175 నాటౌట్; 15 ఫోర్లు, 5 సిక్సర్లు), కామెరాన్ డెల్‌పోర్ట్ (130 బంతుల్లో 160 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) తొలి వికెట్‌కు అభేద్యంగా 367 పరుగులు జోడించారు.
లిస్ట్ ‘ఎ' క్రికెట్‌లో (అంతర్జాతీయ, దేశవాళీ వన్డే మ్యాచ్‌లు) ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. 1999లో హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో సచిన్, ద్రవిడ్ రెండో వికెట్‌కు జత చేసిన 331 పరుగుల రికార్డు ఇప్పుడు బద్దలైంది.