
నేను బతికున్నాను...అదే చాలు: యువీ
బర్మింగ్‌హామ్: నేడు బంగ్లాతో జరిగే మ్యాచ్‌తో యువరాజ్ 300 వన్డేలు పూర్తి చేసుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో కెరీర్‌లో ఏదైనా లోటు ఉండిపోయిందా అనే ప్రశ్నకు యువరాజ్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘నేను ఇంకా బతికే ఉన్నాను. అన్నింటికంటే అదే గొప్ప విషయం’ అని యువీ వ్యాఖ్యానించాడు. తా ను ప్రస్తుతం ఆటపరంగా మంచి స్థితిలో ఉన్నానని, ఇలాంటి సమయంలో కోల్పోయిన కొన్ని విషయాల గురించి మాట్లాడదల్చుకోలేదని అతను అన్నాడు. భారత జట్టులో చోటు దక్కించుకోవడంకంటే దానిని నిలబెట్టుకోవడం ఇంకా కష్టమని అన్నాడు.