ఆస్వాదించినంతకాలం ఆడుతాను: యువరాజ్ | Will play as long as I enjoy the game: Yuvraj | Sakshi
Sakshi News home page

ఆస్వాదించినంతకాలం ఆడుతాను: యువరాజ్

Published Wed, Oct 7 2015 4:35 PM | Last Updated on Sun, Sep 3 2017 10:35 AM

ఆస్వాదించినంతకాలం ఆడుతాను: యువరాజ్

ఆస్వాదించినంతకాలం ఆడుతాను: యువరాజ్

ముంబై: భారత క్రికెట్ జట్టులో స్థానం కోలోయిన సీనియర్ ఆటగాడు యువరాజ్ సింగ్ ఆటను ఆస్వాదించినంతకాలం క్రికెట్ ఆడుతానని చెప్పారు. తిరిగి జట్టులో స్థానం సంపాదించడం ఇప్పటికైతే నెరవేరని కలగానే కనిపిస్తున్నా.. ఆడటం మాననని ఆయన తెలిపారు. రంజీ ట్రోపీ గ్రూప్ లీగ్లో పాల్గొనడానికి ముంబై వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. 'క్రికెట్ ఆడటాన్ని నేను ఆస్వాదిస్తాను. చిన్నప్పటి నుంచి ఈ ఆట అంటే ప్రాణం. ఆటను ఆస్వాదించినంతకాలం ఆడుతాను' అని ఆయన చెప్పారు.


'భారత్ జట్టులో తిరిగి స్థానం సంపాదించడం కోసం ఎదురుచూస్తున్నాను. రంజీ క్రీడలు అందుకు అవకాశం ఇస్తాయి.కాబట్టి ఈ గేమ్స్లో నా ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను' అని స్టైలిష్ లెఫ్ట్ హ్యాండర్ తెలిపారు. రెండుసార్లు వరల్డ్కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న యువరాజు తదుపరి ట్వంటీ-20 వరల్డ్ కప్కు ప్రకటించే జట్టులో తన పేరు ఉంటుందని ఆశాభావంతో ఉన్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement