
న్యూఢిల్లీ: ఒకవైపు కరోనా వైరస్ విజృంభణతో అంతా ఆందోళనలో ఉంటే టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ మాత్రం తాను ఎక్కడా తగ్గేది లేదు అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. కరోనా వైరస్ సంక్షోభంతో సతమతవుతున్న అభిమానులకు వినోదాన్ని ఇవ్వాలనుకున్నాడో.. ఏమో కానీ తాజాగా మరొక టిక్‌టాక్ వీడియాతో అలరించాడు. ప్రస్తుతం క్రికెటర్లంతా ఇంటికే పరిమితమైన నేపథ్యంలో వారికి పూర్తి విశ్రాంతి లభించింది. దీన్ని ఆసరాగా చేసుకుని ఒక లేటెస్ట్ టిక్‌టాక్ వీడియోతో చహల్ ముందుకొచ్చాడు. చహల్‌ను ఒక అమ్మాయి ఆటపట్టిస్తూ ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఒక అమ్మాయి-చహల్‌లు ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటూ కొన్ని అడుగులు ముందుకేస్తారు.
ఈ క్రమంలోనే చహల్ తన షూ లేస్‌ను సరిచేసుకునే పనిలో కిందకు వంగుతాడు. ఆ సమయంలో అమ్మాయి చహల్ వెనుకాలే దాగుని ఆట పట్టించేందుకు యత్నిస్తుంది. కాసేపు ఆ అమ్మాయి కోసం వెతుకున్న చహల్.. కొన్ని సెకన్ల తర్వాత అసలు విషయం తెలుసుకుని ఆమె ముఖంపై ఒక పంచ్ ఇచ్చే యత్నం చేస్తాడు. దీనికి బదులుగా ఆ అమ్మాయి చహల్ బుగ్గలను నెమరి అతని కోపాన్ని తగ్గిస్తుంది. అలా చహల్ బుగ్గలను నెమరిన అమ్మాయి పరుగెత్తూకుంటూ వెళ్లిపోతుంది. ఇది ఒక ప్రేమ కథను మరిపించేలా కొన్ని సెకన్లు పాటు చహల్ చేసిన ఆ మ్యాజిక్ వీడియో బాగానే ఉన్నప్పటికీ, ఫ్యాన్స్ మాత్రం వేషాలు తగ్గలేదని రిప్లై ఇస్తున్నారు. కరోనా వైరస్‌తో ఇంటికి పరిమితం కాకుండా ఇలా చేయడాన్ని తప్పుబడుతున్నారు. ప్రజలంతా రెగ్యులర్‌గా చేతుల్ని వాష్ చేసుకుంటూ ఇంటి పట్టునే ఉండాలని చాలా మంది క్రికెటర్లు అభిమానులకు పలు సూచనలు చేస్తుండగా, చహల్ మాత్రం అందుకు భిన్నంగా టిక్‌టాక్ వీడియో చేయడం నెటిజన్ల నోటికి పని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment