'కూలెస్ట్ పేస్ బౌలర్లలో అతడు ఒకడు' | Zaheer Khan is One of the coolest pace bowlers I know: Sachin | Sakshi
Sakshi News home page

'కూలెస్ట్ పేస్ బౌలర్లలో అతడు ఒకడు'

Published Thu, Oct 15 2015 1:35 PM | Last Updated on Sun, Sep 3 2017 11:01 AM

జహీర్ ఖాన్ తో సచిన్ టెండూల్కర్(ఫైల్)

జహీర్ ఖాన్ తో సచిన్ టెండూల్కర్(ఫైల్)

ముంబై: తనకు తెలిసిన కూలెస్ట్ పేస్ బౌలర్లలో జహీర్ ఖాన్ ఒకడని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. సవాల్ ను స్వీకరించడంలో అతడెప్పుడూ ముందుండే వాడని తెలిపాడు. చాలా సందర్భాల్లో బ్యాట్స్ మెన్ పై అతడు పైచేయి సాధించాడని గుర్తు చేసుకున్నాడు. తన కెరీర్ లో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న జహీర్ ఖాన్.. ఇందులోనూ విజయవంతం అవుతాడని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు. రిటైర్మెంట్ తర్వాత అతడి కెరీర్ బాగా సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపాడు.

ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు జహీర్ ఖాన్ నేడు ప్రకటించాడు. ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా కూడా అతడికి శుభాకాంక్షలు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement