international cricket career
-
ఇంతింతై ఇరవై ఏళ్లుగా...
ఇరవై ఏళ్ల కాలం అంటే ఒక తరం మారిపోతుంది... తరాల మధ్య ఆలోచనలో, ఆచరణలో అంతరం కూడా చాలా ఉంటుంది... కానీ మిథాలీ రాజ్ నిరంతర ప్రవాహంగా కొనసాగిపోతూనే ఉంది. రెండు దశాబ్దాలుగా తన ఆటతో అలరిస్తూనే ఉంది. ఇన్నేళ్లలో మహిళల క్రికెట్ రూపు మార్చుకుంది, ఫార్మాట్లు మారాయి, ఆటగాళ్లూ మారారు... కానీ మారనిది మిథాలీ ఆట మాత్రమే! సగంకంటే ఎక్కువ జీవితం ఆమె క్రికెట్ మైదానాల్లోనే గడిపింది. రికార్డులు కొల్లగొడుతూ పరుగుల వరద పారించినా ఆటపై ఆమెకు మమకారం చెక్కుచెదరలేదు. మహిళల క్రికెట్ అంటే అసలు ఆటే కాదు అంటూ ఎవరూ పట్టించుకోని రోజుల్లో మిథాలీ ఏటికి ఎదురీదింది. కోట్లాది కాంట్రాక్ట్‌లు, మ్యాచ్ ఫీజులు కాదు కదా... కనీసం రోజూవారీ ఖర్చులకు కూడా డబ్బులు లభించని సమయంలో ఆమె ఆటను అభిమానించింది. రెండు తరాలకు వారధిగా నిలుస్తూ అనేక ఘనతలు తన ఖాతాలో వేసుకున్న మిథాలీ కొందరు అభిమానంతో ‘లేడీ సచిన్’ అని పిలుచుకున్నా... సుదీర్ఘ సమయం పాటు భారత మహిళల క్రికెట్‌కు మూలస్థంభంలా నిలిచి స్థాయిని పెంచిన మిథాలీని చూస్తే సచిన్‌తో పోలిక కూడా తక్కువే అనిపిస్తుంది. ఒకప్పుడు తాను ఇష్టపడిన భరతనాట్యాన్ని వదిలేసి పదేళ్ల వయసులో క్రికెట్ వైపు కదిలిన ఆ పాదాలు అలసట లేకుండా క్రికెట్ పిచ్‌పై పరుగెడుతూనే ఉన్నాయి. 303 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 9758 పరుగులతో ఆమె సాగుతూనే ఉంది. 1997 ప్రపంచకప్‌లోనే 15 ఏళ్ల మిథాలీ భారత జట్టులోకి ఎంపికైంది. అయితే ‘మరీ చిన్న అమ్మాయి’గా భావించి టీమ్ మేనేజ్మెంట్ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం ఇవ్వలేదు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు సెంచరీతో చెలరేగి తనేంటో నిరూపించింది. తన మూడో టెస్టులోనే పటిష్టమైన ఇంగ్లండ్‌పై చేసిన డబుల్ సెంచరీ (214)తో ఆమె మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ఆ తర్వాత ఐదు ప్రపంచకప్‌లలో పాల్గొని రికార్డుల మోత మోగించింది. ఇందులో రెండు సార్లు మిథాలీ సారథ్యంలోనే భారత జట్టు ఫైనల్ చేరుకోవడం విశేషం. మధ్యలో కొంత విరామం తప్ప దశాబ్దానికి పైగా భారత కెపె్టన్ అంటే మిథాలీరాజ్ మాత్రమే. ఆసియా కప్‌లు, ముక్కోణపు టోర్నీ టైటిల్స్‌తో ఆమె నాయకత్వంలో విజయాల జాబితా కూడా చాలా పెద్దదే. ఒక అమ్మాయి తన ఫిట్నెస్ను కాపాడుకుంటూ, తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ, నాయకురాలిగా అదనపు బాధ్యతలతో ఇరవై ఏళ్లు ఆటలో కొనసాగడం అసాధారణం. కానీ 37 ఏళ్ల మిథాలీ పయనం ఇంకా ఆగలేదు. 2021 వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనడమే లక్ష్యంగా శ్రమిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించిన ఈ హైదరాబాదీకి హ్యాట్సాఫ్! ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను: మిథాలీ ‘కెరీర్ ఆరంభంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగాను. అన్నింటికి మించి మహిళల సిరీస్‌ల మధ్య సుదీర్ఘ విరామం ఉండటం పెద్ద సమస్యగా కనిపించేది. ఐదు వన్డేల సిరీస్‌లో అద్భుతంగా ఆడి గెలిచిన తర్వాత మరో ఏడు–ఎనిమిది నెలల వరకు మరో సిరీస్ ఉండకపోయేది. విజయాల జోరును కొనసాగించాలని భావించే సమయంలో ఇలాంటి షెడ్యూల్ మా ఉత్సాహాన్ని చంపేసేది. ఇప్పుడున్న తరహాలో పద్ధతిగా మ్యాచ్‌లు జరిగి ఉంటే నేను మరిన్ని మ్యాచ్‌లు ఆడి మరిన్ని ఘనతలు సాధించగలిగేదాన్ని. ఒకప్పుడు కనీస మీడియా కవరేజి కూడా లేని రోజులనుంచి వచి్చన ప్లేయర్‌ను నేను. ఇప్పుడు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు మహిళల క్రికెట్‌ను అనుసరిస్తున్నారు. ఈ రకంగా మహిళల క్రికెట్ ఎదగడం, అందులో నేను భాగం కావడం చాలా సంతృప్తినిచ్చే విషయం. రెండు దశాబ్దాల పాటు ఆటలో కొనసాగడం గర్వించే విషయం.’అంటూ మిథాలీ పేర్కొంది. సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లు ►సచిన్ – 22 ఏళ్ల 91 రోజులు ►జయసూర్య – 21 ఏళ్ల 184 రోజులు ►మియాందాద్ – 20 ఏళ్ల 272 రోజులు ►మిథాలీ రాజ్ – 20 ఏళ్ల 105 రోజులు ►26 – 06 –1999అంతర్జాతీయ క్రికెట్లో మిథాలీ రాజ్ తొలి మ్యాచ్ ఆడిన రోజు -
టీమిండియా సీనియర్ బౌలర్ గుడ్ బై
-
అతడు నా ఫేవరేట్ బౌలర్: ప్రభాస్
ముంబై: అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన పేస్ బౌలర్ జహీర్ ఖాన్ ను టీమిండియా ఆటగాళ్లు, సెలబ్రిటీలు పొగడ్తలతో ముంచెత్తారు. జహీర్ మంచి బౌలర్ అని కితాబిచ్చారు. జట్టుకు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. రిటైర్మెంట్ తర్వాత అతడి కెరీర్ ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. జహీర్ ఖాన్ ను శుభాకాంక్షలు తెలుపుతూ ట్విటర్ సందేశాలు పోస్ట్ చేశారు. ఎవరేం ట్వీట్ చేశారంటే.... హర్భజన్ సింగ్: జహీర్ ఉత్తమ బౌలర్. సహృదయుడు. నా సోదరుడికి మంచి జరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. లవ్ యూ జకీ.. సురేశ్ రైనా: పెర్ ఫెక్ట్ జంటిల్ మన్. బిగ్ బ్రదర్. సరైన నిర్ణయం తీసుకున్నాడు. గుడ్ లక్ ఫర్ న్యూ ఇన్నింగ్స్ వీవీఎస్ లక్ష్మణ్: జహీర్ ఖాన్ తో ఆడడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. దేశం కోసం ఆడుతూ ఆటను ఆస్వాదించాం. అతడి క్రికెట్ కెరీర్ అద్భుతం అనిల్ కుంబ్లే: అత్యుత్తమ ప్రతిభ చూపిన అద్భుత బౌలర్. అతడి భవిష్యత్ కెరీర్ బాగా సాగాలని కోరుకుంటున్నా హీరో ప్రభాస్: క్రికెట్ లో నాకు బాగా ఇష్టమైన బౌలర్లలో జహీర్ ఖాన్ ఒకడు. One of my all time favorite bowler in Cricket @ImZaheer -
'కూలెస్ట్ పేస్ బౌలర్లలో అతడు ఒకడు'
ముంబై: తనకు తెలిసిన కూలెస్ట్ పేస్ బౌలర్లలో జహీర్ ఖాన్ ఒకడని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. సవాల్ ను స్వీకరించడంలో అతడెప్పుడూ ముందుండే వాడని తెలిపాడు. చాలా సందర్భాల్లో బ్యాట్స్ మెన్ పై అతడు పైచేయి సాధించాడని గుర్తు చేసుకున్నాడు. తన కెరీర్ లో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న జహీర్ ఖాన్.. ఇందులోనూ విజయవంతం అవుతాడని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు. రిటైర్మెంట్ తర్వాత అతడి కెరీర్ బాగా సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు జహీర్ ఖాన్ నేడు ప్రకటించాడు. ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా కూడా అతడికి శుభాకాంక్షలు తెలిపారు. One of the coolest pace bowlers I know. He was a bowler who could 'out think' the batsman most of the times. Always up for a challenge (1/2) — sachin tendulkar (@sachin_rt) October 15, 2015 I am sure he will do well as he begins a new chapter in his life. Wishing @ImZaheer all success in his retired life (2/2) — sachin tendulkar (@sachin_rt) October 15, 2015 -
టీమిండియా సీనియర్ బౌలర్ గుడ్ బై
ముంబై: టీమిండియా సీనియర్ బౌలర్ జహీర్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ కు నేడు వీడ్కోలు పలికాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు జహీర్ ఖాన్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి జహీర్ రిటైర్ అవుతున్నాడని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ముందుగా ట్వీట్ చేశారు. 'జహీర్ ఖాన్ ఈరోజు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. రిటైర్మెంట్ తర్వాత అతడి కెరీర్ బాగా సాగాలని ఆకాంక్షిస్తున్నా' అంటూ శుక్లా ట్విటర్ లో పోస్ట్ చేశారు. 2002 నుంచి జహీర్ ఖాన్ తన ఫేవరేట్ బౌలర్ అని పేర్కొన్నారు. ఐపీఎల్ లో అతడు ఆడతాడన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 37 ఏళ్ల జహీర్ ఖాన్ టీమిండియా 2011లో వన్డే ప్రపంచకప్ సాధించడంలో కీలకభూమిక పోషించాడు. ఈ మెగా టోర్నిలో 21 వికెట్లు పడగొట్టి ఆఫ్రిదితో కలిసి టాప్ బౌలర్ గా నిలిచాడు. గత మూడునాలుగేళ్లుగా గాయాల కారణంగా భారత జట్టులోకి వస్తూపోతున్న ఈ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఇంటర్నేషనల్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. 2000లో బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టులో అరంగ్రేటం చేశాడు 200 వన్డేల్లో 282 వికెట్లు తీశాడు 3 వన్డే వరల్డ్ కప్ లలో 23 మ్యాచ్ లు ఆడి 44 వికెట్లు తీశాడు 92 టెస్టుల్లో 311 వికెట్లు పడగొట్టాడు టెస్టుల్లో 11 సార్లు 5 వికెట్లు, ఒకసారి 10 వికెట్లు తీశాడు 17 టి20 మ్యాచ్ లు ఆడి 17 వికెట్లు దక్కించుకున్నాడు -
సురేశ్ రైనా ఘనత
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ సురేశ్ రైనా ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగు పెట్టి నేటికి పదేళ్లు పూర్తయింది. 20 ఏళ్ల వయసులో తొలి వన్డే ఆడాడు. 2005, జూలై 30న దంబుల్లాలో శ్రీలంకతో జరిగిన వన్డేతో ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ఈ ఘనత సాధించడం పట్ల రైనా సంతోషం వ్యక్తం చేశాడు. 'అంతర్జాతీయ క్రికెట్ లో పదేళ్ల కెరీర్ పూర్తి చేసుకోవడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. ఇంత గొప్ప ప్రయాణానికి సహకరించిన నా కుటుంబానికి, బీసీసీఐకి, సెలెక్టర్లకు, సహచరులకు, స్నేహితులకు, అభిమానులకు థ్యాంక్స్. నా కెరీర్ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నా. మరింతగా రాణించి దేశ ప్రతిష్ఠను పెంచుతా' అని రైనా పేర్కొన్నాడు. ఇప్పటివరకు 218 వన్డేలు ఆడిన రైనా 93.80 స్టైక్ రేటుతో 5500 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 35 అర్ధసెంచరీలు ఉన్నాయి. 18 టెస్టులు, 44 అంతర్జాతీయ టి20 మ్యాచ్ లు ఆడాడు. మూడు ఫార్మెట్లలోనూ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్ మన్ గా ఘనత సాధించిన రైనా 2011 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ లోనూ సభ్యుడుగా ఉన్నాడు.