
ఇందర్‌లోక్ భవన ప్రమాదం తవ్వకాలే కొంపముంచాయా?
సాక్షి, న్యూఢిల్లీ: పది మందిని పొట్టనబెట్టుకున్న ఉత్తరఢిల్లీలోని ఇందర్‌లోక్ భవన ప్రమాదానికి పక్క ప్లాటు యజమానే కారణమని అంటున్నారు. పక్కనున్న ప్లాటులో పునాదులు తీయడమే ప్రధాన కారణమని స్థానికులు వాదిస్తున్నారు. ఈ ప్లాటులో భవన నిర్మాణాన్ని నిలిపివేయాలని గతంలోనే మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా పట్టించుకోని యజమాని తవ్వకాలు కొనసాగించినట్టు సమాచారం. దీంతో పక్క భవనం బలహీనంగా మారి కుప్పకూలిందని చెబుతున్నారు. ఈ ఘట నలో పది మంది మరణించారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు.
శిథిలాల కింద చిక్కుకుని గాయపడిన పలువురు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎమ్సీ) విచారణకు ఆదేశించింది. దీనికి బాధ్యులుగా భావిస్తున్న అధికారులపైనా విచారణ కొనసాగుతోందని మేయర్ యోగేందర్ చందోలియా చెప్పారు. ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేశామని ప్రకటించారు. ‘పక్క ప్లాట్‌లో జరుగుతున్న నిర్మాణపనుల కారణంగా భవనం కూలినట్లు అనుమానిస్తున్నాం. ఉదయం 8.30 గంటలకు ఈ ఘటన జరిగింది’ అని అన్నారు. ఇది 50 సంవత్సరాలనాటి భవనమని, ఇందులో ఎనిమిది కుటుం బాలు నివాసం ఉంటున్నాయని తెలిపారు. గాయపడ్డ రోహిణీ జోన్లో రెండు భవనాలు ప్రమాదకరంగా ఉన్నాయని నిర్ధారించారు. రోహిణిలోని భవనాలను పాక్షికంగా కూల్చివేశారు.
హోంమంత్రి దిగ్భ్రాంతి
తులసి నగర్ భవన దుర్ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయ కార్యక్రమాల కోసం జాతీయ విపత్తుల వారిలో ముగ్గురిని బారా హిందూరావ్ ఆస్పత్రికి, ఒకరిని ఆచార్య భిక్షు ఆస్పత్రికు తరలించారు. వీరిలో ముగ్గురు ఆస్పత్రికి వచ్చేసరికే మరణించారని, గాయపడిన మరో ఇద్దరికి చికిత్స చేస్తున్నామని బారా హిందూరావ్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్.బి. మిట్టల్ చెప్పారు. భవనం కూలిన ఘటన గురించి తొమ్మిది గంటలకు సమాచారం అందుకున్న అగ్నిమాపక విభాగం వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు ఆరంభించింది. తదనంతరం మున్సిపల్ సిబ్బంది బృందం శిథిలాల తొలగింపు పనులు చేపట్టింది. కూలిపోయిన భవనం ఇరుకుగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం వాటిల్లింది.
విచారణకు ఆదేశించిన ఎన్డీఎమ్సీ
ఈ దుర్ఘటనపై ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ విచారణకు ఆదేశించింది. తులసినగర్ ప్రాంతం కరోల్‌బాగ్ జోన్ పరిధిలోకి వస్తుంది. కమిషనర్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారని, ఇంజనీరింగ్ విభాగం అడిషనల్ కమిషనర్‌కు ఈ బాధ్యత అప్పగించారని ఎన్డీఎమ్సీ ప్రజాసంబంధాల అధికారి యోగేంద్ర సింగ్ మాన్ చెప్పారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన చెప్పారు. భవనం కూలడానికి కారణమేమిటని అడిగిన ప్రశ్నకు మాన్ సమాధానమిస్తూ ‘ఈ ఘటనపై వెంటనే వ్యాఖ్యానిం చడం సబబు కాదు. పక్కనున్న ప్లాటులో పునాదు లు తీయడం ఒక కారణం కావచ్చని అంటున్నా రు.
భవన నిర్మాణాన్ని నిలిపివేయాలని గతంలో పక్క ప్లాటు యజమానులకు నోటీసు జారీ చేశాం. వారు ఆదేశాలను బేఖాతరు చేసి తవ్వకాలు కొనసాగించారు. అందువల్ల ప్లాటు యజమానులపై తగిన చర్య తీసుకుంటాం’ అని మాన్ చెప్పారు. ఎన్‌డీఎమ్సీ ఈ ఏడాది మొదట్లో నిర్వహిం చిన సర్వే ఉత్తర ఢిల్లీలో 144 భవనాలు ప్రమాదకరంగా ఉన్నాయని తేల్చింది. ఒక్క సదర్ పహా డ్‌గంజ్ జోన్‌లోనే 137 భవనాలు ప్రమాదకరంగా ఉన్నాయని గుర్తిం చారు. కరోల్‌బాగ్ ప్రాంతంలో ఒక భవనం, సిటీ జోన్‌లో నాలుగు భవనాలు, స్పందన దళ (ఎన్డీఆర్‌ఎఫ్) సభ్యులను పంపించామని ప్రకటించారు. ఈ ఘటనలో గాయాలపాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్విటర్‌లో సందేశాన్ని పోస్టు చేశారు.
నాసిరకం సామగ్రితో సర్వనాశనం
తులసినగర్‌లో శనివారం సంభవించిన దుర్ఘటన నగరంలోని భవనాల పటిష్టతపై మరోసారి సందేహాలు రేకెత్తించింది. నిర్మాణానికి నాసిరక సామగ్రి వాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఢిల్లీలో జరిగిన భవనాల దుర్ఘటన వివరాలు.
2014, జూన్ 1: పాత ఢిల్లీ సదర్ బజార్‌లో మూడంతస్తుల భవనం కూలడంతో ముగ్గురు మరణించగా, 12 మంది గాయపడ్డారు. నాసిరక సామగ్రి వినియోగం వల్లే ఈ ఘటన జరిగిందని తేలింది. 2014, ఫిబ్రవరి 17 : సెంట్రల్ ఢిల్లీ సదర్ బజార్ భవనంలోని చివరి రెండు అంతస్తులు కూలడంతో ఇద్దరు మహిళలు మరణించగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. భవనం శిథిలావస్థకు చేరుకోవడం వల్లే ఇలా జరిగిందని తేల్చారు.2013, అక్టోబర్ 15 : కాశ్మీరీగేటులోని ఒక పాత భవనం కూలడంతో మహిళ, ఆమె కూతురు మరనించారు. మరికొందరికి గాయాలయ్యాయి. 2013, అక్టోబర్ 9 : సదర్ బజార్‌లోని 50 ఏళ్ల పాత భవనం కూలి ఇద్దరు మరణించగా, ఒకరికి గాయాలయ్యాయి.