89 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు బుధవారం రసాభాసగా మారాయి. అధికార, ప్రతిపక్షాల సభ్యులు పరస్పరం తీవ్ర ఆరోపనలు చేసుకుంటూ.. వాగ్వాదానికి దిగటంతో స్పీకర్ ధనపాల్.. 89 మంది డీఎంకే ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వీరిపై వారం రోజులపాటు వేటు వేయడం గమనార్హం.
అధికార ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ప్రతిపక్షనేత స్టాలిన్పై తీవ్ర విమర్శలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో డీఎంకే ఎమ్మెల్యేలు సభలో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూ సభను అడ్డుకున్నారు. అసహనానికి లోనైన స్పీకర్ ధనపాల్ డీఎంకే సభ్యులను వారం రోజులపాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షనేత స్టాలిన్ను మార్షల్లు హౌస్ నుంచి బయటకు ఎత్తుకొచ్చారు. అధికార ఎఐఏడీఎంకే ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని డీఎంకే ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు.