నగల కోసం స్నేహితురాలిని చంపేసింది | 9th class student killed her friend due to gold ornaments in tamilnadu | Sakshi
Sakshi News home page

నగల కోసం స్నేహితురాలిని చంపేసింది

Published Tue, Feb 3 2015 9:31 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

నగల కోసం స్నేహితురాలిని చంపేసింది - Sakshi

నగల కోసం స్నేహితురాలిని చంపేసింది

తిరువొత్తియూరు: బంగారు కమ్మలు కోసం స్నేహితురాలిని ఓ విద్యార్థిని కడతేర్చింది. ఈ సంఘటన తమిళనాడులోని దిండివనంలో చోటుచేసుకుంది. దిండివనం సమీపంలోని మోలసూరు గ్రామానికి చెందిన రవి లారీడ్రైవర్. ఆయన కుమార్తె శశిరేఖ (14) ఓమలూరులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతోంది. గత నెల 31న స్కూల్‌కు వెళ్లిన శశిరేఖ ఇంటికి తిరిగి రాలేదు. సమాచారం అందుకున్న కిళయనూరు పోలీసులు కేసు  దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మోలసూరు ప్రాంతంలో ఉన్న బావిలో శశిరేఖ మృతదేహం బయట పడింది. కుమార్తె మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

ఆగ్రహం చెందిన గ్రామస్తులు హంతకుల్ని అరెస్టు చేయాలని ఆందోళనకు దిగారు. హత్యకు గురైన శశిరేఖ అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న  అనిత స్నేహితులు. శనివారం శశిరేఖకు జన్మదినం కావడంతో కొత్తగా కొనుగోలు చేసిన బంగారు కమ్మలు వేసుకుని పాఠశాలకు వెళ్లింది. ఇంటికి వెళ్లే సమయంలో అనిత ఆమెతో పాటుగా వచ్చినట్టు విచారణలో తేలింది. పోలీసులు అనితను అదుపులోకి తీసుకుని విచారించారు. పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న సమయంలో శశిరేఖ ధరించిన కమ్మలు కోసం హత్య చేయడానికి నిర్ణయించినట్టు పేర్కొంది. 

పాఠశాల నుంచి ఇంటికి వెళుతుండగా బావిలో స్నానం చేయడానికి శశిరేఖను తీసుకె ళ్లినట్టు పేర్కొంది. కొత్త కమ్మలు వేసుకోవాలని శశిరేఖకు చెప్పడంతో కమ్మలు తీసి అనితకు ఇచ్చింది. కమ్మలు తీసుకున్న తరువాత శశిరేఖను బావిలోకి తోసి అనిత ఏమి తెలియనట్టు ఇంటికి వచ్చేసినట్టు పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు అమెను అరెస్టు చేశారు. దాచి ఉంచిన కమ్మలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement