‘ఆధార్’ వేగవంతం
Published Sat, Sep 14 2013 3:27 AM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM
ఆధార్‌కార్డుల జారీలో వెనుకబడిన విషయూన్ని గుర్తించిన అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. నివాసిత ప్రాంతాల్లోనే శిబిరాల నిర్వహణకు శ్రీకారం చుట్టనున్నారు. అక్టోబర్ ఆఖరు నాటికి 70 శాతం మందికి కార్డుల జారీ లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: దేశ వ్యాప్తంగా ఆధార్‌కార్డుల జారీ ప్రక్రియ సాగుతోంది. చెన్నై కార్పొరేషన్ పరిధిలోని వార్డు కార్యాలయాల్లో ఆధార్ కార్డులు జారీ చేసే ప్రక్రియ సాగుతోంది. దాదాపు ఏడాది అవుతున్నా 35 శాతం మందికీ కార్డులు జారీ కాలేదు. ఆధార్‌కార్డు పొందేందుకు ఇళ్ల వద్ద కూపన్లు పంచిన సమయంలో ప్రజలు అందుబాటులో లేకపోవడం, మరికొన్ని కారణాల వల్ల ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఆధార్‌కార్డుల జారీకి అవాంతరం ఏర్పడవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కారణంగా నగరం నలుమూలల ప్రత్యేక శిబిరాలను నిర్వహించడం ద్వారా అక్టోబర్ ఆఖరుకు 70 శాతం మందికి కార్డులు జారీ చేయూలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ముందుగా ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయనున్నారు. నివాస గృహాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే శిబిరాలు నిర్వహించనున్నారు. అపార్టుమెంట్లలోని వారు తమ సంఘం తరపున లిఖితపూర్వకంగా కోరితే స్థానికంగానే శిబిరం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర సెన్సెస్ అసిస్టెంట్ డెరైక్టర్ ఎమ్మార్వీ కృష్ణారావు శుక్రవారం మీడియాకు తెలిపారు. కుటుంబంలో ఐదేళ్లకు పైనున్న ప్రతి వ్యక్తీ ఆధార్‌కార్డు పొందేందుకు అర్హులని తెలిపారు. ఆధార్‌కార్డును కోరుకునే ప్రజలు తమ విజ్ఞప్తులను చెన్నై రాజాజీ హాలులోని సెన్సెస్ డెరైక్టరు కార్యాలయంలో అందజేయాలని ఆయన సూచించారు.
Advertisement
Advertisement