సాక్షి, బెంగళూరు/మైసూర్ : యూపీఏ పాలనలో గ్యాస్‌తో ఆధార్ లింక్‌ను వ్యతిరేకించి బీజేపీ.. నేడు అదే దారి పట్టింది. దీంతో నగదు బదిలీ పథకం మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే ఈ సారి గతంలో మాదిరి ‘ఆధార్’ ఖచ్చితం కాబోదు. ఈ విధానాన్ని మొదట తుమకూరు, మైసూరు జిల్లాల్లో అమలుచేసి ఫలితాలను అనుసరించి ఆపై రాష్ట్రమంతటా ఈ నూతన విధానాన్ని విస్తరించడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.
అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరిగితే ఈనెల 15న పెలైట్ ప్రతిపాదికన ఈ రెండు జిల్లాల్లో నూతన విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది. ప్రస్తుతం వంట గ్యాస్‌ను సబ్సిడీపై వినియోగదారులకు ప్రభుత్వం అందిస్తోంది. అయితే ఈ విధానంలో అక్రమాలకు తావున్నట్లు గుర్తించిన ప్రభుత్వం మొదట వినియోగదారుడు గ్యాస్ సిలెండర్‌ను బుక్ చేసిన సమయంలో సబ్సిడీ మొత్తాన్ని అతని బ్యాంక్ అకౌంట్‌లోకి ప్రభుత్వం జమ చేస్తుంది.
ఆపై డెలివరీ సమయంలో పూర్తి ధరను చల్లించి సిలెండర్‌ను వినియోగదారుడు పొందాల్సి ఉంటుంది. ఇందుకు ఆధార్ నంబర్‌ను కలిగి ఉండాలనే నిబంధన విధించారు. దీనిని ఆధార్ బేస్డ్ డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ఫర్ ఎల్‌పీజీ (డీబీటీఎల్) అంటారు. ఈ విధానాన్ని రాష్ట్రంలో జనవరిలో కొద్ది రోజుల పాటు ప్రభుత్వం అమలు చేసింది. అయితే విధివిధానాల్లో అస్పష్టత, సాంకేతిక లోపాలు, న్యాయపరమైన చిక్కుళ్ల వల్ల ఈ విధానం మార్చి నెలలో అర్ధాంతరంగా ఆగిపోయింది.
నూతన గైడ్‌లైన్స్ ఇవి...
నూతన గైడ్‌లైన్ ప్రకారం అర్హులను రెండు విభాగాలుగా గుర్తిస్తారు. మొదటి విధానంలో గ్యాస్ వినియోగదారునికి ప్రత్యేక సంఖ్య (యునిక్)ను గ్యాస్ కంపెనీలు కేటాయిస్తాయి. ఈ సంఖ్యను తమ బ్యాంక్ అకౌంట్‌కు సదరు వినియోగదారుడు జత చేసి నగదు బదిలీ పథకానికి అర్హుడు కావచ్చు. ఈ విభాగంలోని వినియోగదారులను బ్యాంక్ బేస్డ్ క్యాష్ ట్రాన్స్‌ఫర్ కంన్సూమర్ (బీసీటీసీ)గా గుర్తిస్తారు. మరోవైపు ఇప్పటికే ఆధార్ సంఖ్యను తమ గ్యాస్ కంజ్యూమర్ ఐడీతో అనుసంధానం చేసినవారిని ‘ఆధార్ బేస్డ్ క్యాష్ ట్రాన్స్‌ఫర్ కంజ్యూమర్’గా (ఏసీటీసీ)గా పేర్కొంటారు.
వీరికి కూడా డీబీటీఎల్ పథకానికి అర్హులు. ఇదిలా ఉండగా బీసీటీసీ విభాగంలోని వారు ఆధార్ కార్డు వచ్చిన తర్వాత ఏసీటీసీ విభాగానికి మారాల్సి ఉంటుంది. ఇందుకు ప్రభుత్వం మూడు నెలల సమయం ఇవ్వాలని నిర్ణయించింది. అంటే అధార్ లేకుండానే బీసీటీసీ వినియోగదారులు మూడు నెలల పాటు డీబీటీఎల్ పథకానికి అర్హులన్నమాట. ఇదిలా ఉండగా ఏసీటీసీ విభాగంలోని వినియోగదారులు మాత్రం ఎట్టి పరిస్థితితోనూ బీసీటీసీ విభాగంలోకి మారడానికి అవకాశం కల్పించరు. దీని వల్ల భవిష్యత్తులో ప్రతి గ్యాస్‌వినియోగదారుడూ ఆధార్‌ను అనుసంధానం చేసి డీబీటీఎల్‌ను అమలు చేయడానికి వీలవుతుందనేది ప్రభుత్వ భావన.
అయితే ఈ విషయమై వినియోగదారుల హక్కుల కోసం కృషి చేస్తున్న బెంగళూరుకు చెందిన మహంతేష్ మాట్లాడుతూ... ‘వివిధ పేర్లతో తిరిగి ఆధార్‌ను ప్రభుత్వ పథకాలకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఇది కోర్టు ధిక్కా రం కిందికి వస్తుంది.’ అని పేర్కొన్నారు.
వంట గ్యాస్‌కు నగదు బదిలీ
Published Wed, Nov 12 2014 3:08 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement