గుర్గావ్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఆమ్ ఆద్మీ పార్టీ సోమవారం ఎన్నికల కమిషన్‌ను కోరింది.
న్యూఢిల్లీ: గుర్గావ్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఆమ్ ఆద్మీ పార్టీ సోమవారం ఎన్నికల కమిషన్‌ను కోరింది. కొన్ని కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగిందని, అందుకే ఆయా ప్రాంత్లా ఓటింగ్ శాతం 90 నుంచి 95కు చేరుకుందని ఈసీకి తెలిపింది. నుహ్, ఫిరోజ్‌పూర్-జిర్కా, పున్హనా అసెంబ్లీ సెగ్మెంట్‌లలో రీపోలింగ్ నిర్వహించాలని అభ్యర్థించింది. ఈ మేరకు ఇక్కడి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున లోక్‌సభ అభ్యర్థిగా బరిలో ఉన్న యోగేంద్ర యాదవ్ ఈసీకి లేఖ రాశారు. ఈ మూడు నియోజకవర్గాల పరిధిలోని 110 స్థానాల్లో శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని కోరారు.