న్యూఢిల్లీ : యాక్షన్ గ్రూపు రియాల్టీ సంస్థ, మైక్రోటెక్ దిగ్జజం సంయుక్తంగా హౌసింగ్ ప్రాజెక్టు రంగంలోకి అడుగుపెడుతున్నాయి. గుర్గావ్‌లో హౌసింగ్ ప్రాజెక్టులో రూ. 500 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. మైక్రోటెక్‌తోపాటు సమాన వాటాలతో యాక్షన్‌గ్రూపు, ఒకాయ్ పవర్‌లు రూ.300 కోట్లతో ఎల్‌అండ్‌టీతో కలిసి 14.6 ఎకరాల్లో హౌసింగ్ ప్రాజక్టును చేపట్టేందుకు ఒప్పందం కుదుర్చుకొన్నాయి. గుర్గావ్‌లో 716 యూనిట్లలో హౌసింగ్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నామని, దీన్ని త్వరలోనే ప్రారంభించి 2017 వరకు అందుబాటులోకి వచ్చే విధంగా కృషి చేస్తున్నామని మైక్రోటెక్ ఇన్‌ఫ్రాస్టక్చ్‌ర్ మేనేజింగ్ డెరైక్టర్ అజయ్ అగర్వాల్ ఆదివారం మీడియాకు తెలిపారు. ప్రాజెక్టు ఖర్చు రూ.450 కోట్ల నుంచి 500 కోట్ల వరకు అంచనా వేసినట్లు చెప్పారు.
ఈ మొత్తాన్ని అంతర్గత వనరులు, బ్యాంక్ లోన్ల ద్వారా సమకూర్చనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ఎల్ అండ్ టీతో రూ. 300 కోట్ల మేరకు ఒప్పందం కుదుర్చుకొన్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టులో అల్యూమినియాన్ని వినియోగిస్తూ సున్నితంగా నిర్మిస్తున్నామని, ఇది ఎక్కువ కాలం మనుగడ సాగిస్తాయని చెప్పారు. ఇన్‌ఫ్రాస్టక్చర్ సంస్థ భవిష్యత్‌లో ఉత్తర భారత్‌లో భారీ భూములను సేకరించి(ల్యాండ్ బ్యాంక్), మరిన్ని ప్రాజెక్టుల రూపకల్పనకు పాటుపడుతామని చెప్పారు. యాక్షన్ గ్రూపు ఇప్పటికే రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తోంది, చెప్పుల తయారీ, రసాయన పరిశ్రమలు, హెల్త్‌కేర్ రంగాల్లో రాణిస్తోందని చెప్పారు. అదేవిధంగా మైక్రోటెక్ ఇన్‌ఫ్రా, యాక్షన్ గ్రూపు కలిసి మరొ వెంచర్ ‘సన్‌సిటీ ప్రాజెక్టు’ని చేపట్టనున్నాయన్నారు. ఒకాయ్ సంస్థ ఇప్పటికే బ్యాటరీ తయారీ, నీటి శుద్ధి వ్యాపారాలను నిర్వహిస్తోందని చెప్పారు.
హౌసింగ్ రంగంలోకి ‘మైక్రోటెక్, యాక్షన్’
Published Sun, Dec 28 2014 10:50 PM | Last Updated on Thu, Sep 27 2018 2:34 PM
Advertisement
Advertisement