సాక్షి, ముంబై: కేరళలోని కొచ్చిలో నిర్వహించిన ఈశాన్య దక్షిణాది రాష్ట్రాల కవి సమ్మేళనంలో ముంబైకి చెందిన కవి సంగెవేని రవీంద్ర చదివిన కవిత సభికుల ప్రశంసలను అందుకుంది. గత నెల నవంబరు 27నుంచి డిసెంబరు ఎనిమిదవతేదీ వరకు కొనసాగిన ‘18వ కొచ్చి అంతర్జాతీయ పుస్తకోత్సవాల (కేఐబీఎఫ్)’ కార్యక్రమంలో బాగంగా ఈ కవి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా, ఇందులో తెలుగు కవితలను విన్పించేందుకు ముంబైకి చెందిన అఖిల భారతీయ తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి సంగెవేని రవీంద్రతోపాటు వరంగల్‌కు చెందిన రామా చంద్రమౌళి అనే ఇద్దరు తెలుగు కవులకే అవకాశం లభించింది.
ఈ సందర్భంగా రవీంద్ర చదివిన ‘ఊరు కవరేజీ ఏరియాలో లేదు’ అనే కవితకు అందరిని ఆకట్టుకుంది. వివిధ భాషలకు చెందిన కవులు తమ కవిత్వాలను వినేందుకు వేదికగా మారిన ఈ కార్యక్రమాన్ని ప్రముఖ మళయాళి రచయిత ఎం కె సాను ప్రారంభించగా మళయాళి సాహిత్య అకాడమీ సలహదారు, సమితి కన్వీనర్ సి రాధాకృష్ణన్ అధ్యక్షత వహించారు. కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఎర్నాకులతప్పంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈశాన్య, దక్షిణాధి బాషలకు చెందిన కవులు, రచయితలు బాషాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కేఐబీఎఫ్‌లో ముంబై కవికి ప్రశంసలు
Published Mon, Dec 8 2014 10:30 PM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM
Advertisement
Advertisement